Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • అయోధ్య రామ మందిర భూమిపూజకు ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది. ఇది ఆ రాముడు పంపిన ఆహ్వానంగా భావిస్తున్నాను. అయోధ్య నగరం గంగ-యమునా-తెహజీబ్ సంస్కృతికి నిదర్శనం. ఇక్కడ హిందు-ముస్లిం ఎప్పుడూ సయోధ్యతో ఉంటారు. 70 ఏళ్లుగా భూ వివాదం గురించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేశాం. ఇప్పుడు వివాదం ముగిసింది. సుప్రీం తీర్పును ఆహ్వానించాం. అయితే సుప్రీం తీర్పు మేరకు మసీదు కోసం స్థలం అయోధ్యలోనే ఇస్తే సంతోషించేవాళ్ళం. కానీ సిటీకి 25కిమీ దూరంలో స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చారు. అయోధ్య అనేక ధర్మాలకు వేదికైన నగరం. మందిర నిర్మాణం తర్వాత అభివృద్ధి చేయడం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అయోధ్య నగరం అభివృద్ధిలో ఇంతకాలం వెనుకబడి ఉంది. ఇకపై పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము.
  • నేడు ఆంధ్ర యుానివర్సిటి లా కాలేజ్ ప్లాటినం జూబ్లీ సమావేశం . ఆన్లైన్ లో జరగనున్న సమావేశం. ఆన్ లైన్ సమావేశంలో పాల్గోనున్న కళాశాల పూర్వ విద్యార్ధి, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • ప్రముఖ వాగ్గేయ కారుడు, ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో మృతి.గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాదరావు . తెల్లవారుజామున పార్వతీపురం ఆయన స్వగృహ0లో గుండెపోటుతో మృతి . వందలాది జానపద పాటలు రచించి గజ్జె కట్టి ఆడి పడిన వంగపండు . పల్లెకారులతో పాటు, గిరిజనులను అవగాహన కల్పించిన ప్రసాదరావు . ప్రసాదరావు.మృతికి పలువురు కళాకారులు, ప్రముఖుల దిగ్భ్రాంతి.
  • స్వీయ నిర్బంధం లోకి వెళ్లిన త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్. నా కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర కుటుంబ సభ్యులు NEGATIVE వచ్చింది. నేను కూడా COVID19 పరీక్ష చేయించుకున్నాను.రిజల్ట్ ఇంకా రాలేదు. నేను నా నివాసంలో స్స్వీయ నిర్బంధ లోకి వెళ్ళాను. మా కుటుంబ సభ్యుల త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ట్విట్టర్లో త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్.

గుడ్‌న్యూస్.. త్వరలో భారత్-పాక్ ఢీ.. వేదిక ఇదే..!

భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూస్తున్న అభిమానులకు దాదా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఆసియా కప్.. దుబాయ్‌లో జరుగుతుందని తెలిపారు.
India Pakistan To Play Asia Cup In Dubai Says Sourav Ganguly, గుడ్‌న్యూస్.. త్వరలో భారత్-పాక్ ఢీ.. వేదిక ఇదే..!

భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూస్తున్న అభిమానులకు దాదా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఆసియా కప్.. దుబాయ్‌లో జరుగుతుందని తెలిపారు. అంతేకాదు.. ఈ కప్‌లో భారత్, పాక్ జట్లు తలపడతాయని కూడా గంగూలీ స్పష్టం చేశారు.

వాస్తవానికి ఈ సారి జరిగే ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే సెక్యూరిటీ పరమైన కారణాల వల్ల పాకిస్థాన్‌కు భారత జట్టు పంపేదే లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీంతో ఆసియాకప్ వేదిక కాస్త దుబాయ్‌కి మారిపోయింది. మార్చి 3న జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్తున్న గంగూలీ.. ఈడెన్ గార్డెన్‌లో మాట్లాడిన దాదా.. ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా.. భారత్‌, పాక్‌‌ జట్లు చివరి సారిగా 2012-13 ద్వైపాక్షిక సీరీస్‌లో ఆడాయి. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య విభేదాల తలెత్తిన నేపథ్యంలో మరో సిరీస్ ఇప్పటివరకు జరగలేదు. ఐసీసీ వేదికగా జరిగిన ప్రధానమైన టోర్నమెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నాయి.

Related Tags