క్రీడల్లో రాజకీయాలు.. మళ్ళీ అదే సీన్ !

క్రీడలు, రాజకీయాలు మిక్స్ కాకూడదన్నది ఓ సిధ్ధాంతం. కానీ ఇది జరిగేలా లేదు. భారత, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ల సందర్భంగా ఈ సీన్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తోంది. రాజకీయ కాష్ఠమైన కాశ్మీర్ సమస్య ఈ టీముల మీదా ఏదో విధంగా ప్రభావం చూపింది. 2008 నుంచి భారత, పాక్ ‘ క్రికెట్ సంబంధాలు ‘ దాదాపు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఘటన అనంతరం ఇవి మరింత దిగజారాయి. భారత […]

క్రీడల్లో రాజకీయాలు.. మళ్ళీ అదే సీన్ !
Follow us

|

Updated on: May 24, 2019 | 6:38 PM

క్రీడలు, రాజకీయాలు మిక్స్ కాకూడదన్నది ఓ సిధ్ధాంతం. కానీ ఇది జరిగేలా లేదు. భారత, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ల సందర్భంగా ఈ సీన్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తోంది. రాజకీయ కాష్ఠమైన కాశ్మీర్ సమస్య ఈ టీముల మీదా ఏదో విధంగా ప్రభావం చూపింది. 2008 నుంచి భారత, పాక్ ‘ క్రికెట్ సంబంధాలు ‘ దాదాపు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఘటన అనంతరం ఇవి మరింత దిగజారాయి. భారత యుధ్ధ విమానాలు పాక్ భూభాగంలోని బాలాకోట్ పై దాడులు జరిపాయి. ఈ పరిణామాల ప్రభావమా అన్నట్టు జూన్ 16న మాంచెస్టర్ లో పాక్ తో జరిగే మ్యాచ్ ని బాయ్ కాట్ చేయాలని విరాట్ కోహ్లీ సహచర సభ్యులు అతడ్ని కోరారు.. క్రికెట్ హిస్టారియన్ బొరియా మజుందార్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. క్రీడలు, పాలిటిక్స్ ఎప్పుడూ మింగిల్ అవడం సహజమేనన్నారు. క్రీడా మైదానంలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడే జాతీయ భావం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. పుల్వామా దాడి అనంతరం కోహ్లీ, అతని జట్టు గత మార్చిలో ఆస్ట్రేలియా టీమ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత దళాలకు సంఘీభావంగా సైనిక దుస్తులు ధరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2003 లో అప్పటి బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లేయిర్ వైఖరి కారణంగా తమకు భద్రత ఉండదని భావించిన ఇంగ్లాండ్ జట్టు హరారే లో జరిగే వాల్డ్ కప్ లో పాల్గొనేందుకు నిరాకరించారని ఆయన గుర్తు చేశారు.