Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

కళ్ళు చెదిరే కోట్ల డబ్బు …నిజాం వారసులకు దక్కేనా ?

INDIA, PAKISTAN CLASH, కళ్ళు చెదిరే కోట్ల డబ్బు …నిజాం వారసులకు దక్కేనా ?

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య హైదరాబాద్ నిజాం కు చెందిన కోట్లకొద్దీ సొమ్ము (సుమారు 35 మిలియన్ పౌండ్లు) కు సంబంధించిన వివాదం పీక్ స్టేజీకి చేరింది. అది 1947 లో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజన జరిగిన సమయం . రెండు దేశాలూ విడిపోయిన కాలం. ఈ సొమ్మును లండన్లోని నాట్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుకు తాము ఆయుధాలు అందజేశామని, అందువల్ల తమకే ఈ డబ్బు చెందాలని పాకిస్థాన్ కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే పాక్ వాదన సరికాదని, ఈ సొమ్ము తమకే చెందాలని నిజాం వారసులైన ప్రిన్స్ ముకరం జా, ఆయన తమ్ముడు ముఫక్కం జా కోర్టుకెక్కారు. 1948 లో అప్పటి హైదరాబాద్ నిజాం సుమారు 1,007,940 పౌండ్లను బ్రిటన్లోని పాక్ హైకమిషనర్ అకౌంటుకు బదిలీ చేయడంతోనే వివాదం మొదలైంది. ఆ డబ్బు ఏ ఏటికా ఏడు పెరుగుతూ వచ్చింది. కాగా-తమ తాత గిఫ్టుగా ఇచ్చిన ఈ నిధులకోసం ఎనిమిదో నిజాం, ఆయన సోదరుడు దశాబ్దాల తరబడి వేచి చూశారని, కానీ పాకిస్థాన్ 70 ఏళ్లుగా అడ్డు తగులుతోందని వారసుల తరఫు న్యాయవాది పాల్ హెవిట్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టర్కీలో ఉన్న ఈయన .. పాకిస్థాన్ వాదన అర్థరహితమన్నారు.1947 ప్రాంతంలో ‘ భారత ఆక్రమణను తాము ఎదుర్కొన్నామని చెబుతున్న ‘ పాకిస్థాన్ కు అసలు ఈ సొమ్ము ఎలా చెందుతుందని ఆయన ప్రశ్నించారు. అటు- లండన్ కోర్టులో జస్టిస్ మార్కస్ స్మిత్ రెండువారాలుగా ఉభయ పక్షాల వాదనలను ఆలకిస్తున్నారు. స్వర్గీయ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కు చెందిన ఈ నిధులు నిజానికి ఎవరికి చెందాల్సి ఉందని ఆయన ప్రశ్నించారు. చట్టానికి లోబడి తాము తీర్పు ఇవ్వాల్సి ఉందని, కోట్ల కొద్దీ సొమ్ము విషయంలో ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా-భారతీయ కరెన్సీలో దాదాపు 309 కోట్లకు పైగా..కళ్ళు చెదిరే రీతిలో లండన్ బ్యాంకులో మూలుగుతున్న ఈ నిధుల విషయంలో భారత ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తున్నది చూడాల్సి ఉంది. పేరుకు ఇది నిజాం వారసులకు చెందాల్సి ఉన్నా.. పాకిస్తాన్ తో ఈ వ్యవహారం ముడిపడిఉన్న సంగతి గమనార్హం. . అసలే ఈ పొరుగు దేశంతో సత్సంబంధాలు అంతగా లేని ఈ తరుణంలో అక్కడి హైకమిషనర్ లండన్ కోర్టులో ఈ కేసు విచారణను ప్రభావితం చేస్తారా అన్న అంశాన్ని న్యాయ నిపుణులు లేవనెత్తుతున్నారు. పాక్-బ్రిటన్ మధ్య గల సంబంధాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

Related Tags