భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి.. అయినా… ట్రంప్ నోట అదే పాత మాట !

The comments were Trump’s first and comes two weeks s, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి.. అయినా… ట్రంప్ నోట అదే పాత మాట !

కశ్మీర్ అంశంపై తమ దేశాల మధ్య తలెత్తిన ప్రతిష్టంభనను తామే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఓ వైపు భారత్ పదేపదే ప్రకటిస్తున్నా.. అమెరికా ‘ పెద్దన్న ‘ ట్రంప్ మాత్రం.. మళ్ళీ పాత పాటే పాడాడు. గతంతో పోలిస్తే.. గత రెండు వారాలుగా భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని ఆయన చెప్పాడు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను ఇప్పటికీ సిధ్ధమేనన్నాడు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని భారత ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం.. రెండు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కశ్మీర్ విభజన అనంతరం నేను రెండు దేశాల ప్రధానులతో మాట్లాడాను.. సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించాను.అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇందుకు వారిద్దరూ దాదాపు అంగీకరించారని, గత రెండు వారాలుగా వారి దేశాల మధ్య పరిస్థితి కొంతవరకు చల్లబడిందని తెలిపారు. ఏమైనా … మధ్యవర్తిత్వం వహించేందుకు తాను ఇప్పటికీ రెడీగా ఉన్నానన్నారు. దీనిపై వారే ఆలోచించుకోవాలని ట్రంప్ అన్నారు.అయితే తమ దేశంలో పెరిగిపోతున్న గన్ సంస్కృతికి అడ్డుకట్ట వేయలేకపోతున్న ఈ దేశాధ్యక్షుడు భారత-పాక్ దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించగలుగుతాడని ఎనలిస్టులు తర్జనభర్జన పడుతున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *