దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతుంది.

  • Balaraju Goud
  • Publish Date - 11:20 am, Sat, 24 October 20

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతుంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 53,370 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ఒక్క రోజే మాయదారి వైరస్ బారిన పడి 650 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 8.71 శాతానికి తగ్గాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రికవరీ రేటు 89.78 శాతంగా నమోదు అయ్యింది. మరణాలు రేటు 1.51 శాతానికి చేరింది. మంగళవారం కొత్తగా 12,69,479 నమూనాల్ని పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక, ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 78,14,682కు చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6,80,680 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 70,16,046 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. వరుసగా రెండో రోజు క్రియాశీల కేసుల సంఖ్య 7లక్షల దిగువన నమోదైంది. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,17,956 మంది ప్రాణాలు కోల్పోయారు.