దేశం మీ వెంట ఉంది.. ఇస్రో భుజం తట్టి భరోసా ఇచ్చిన మోదీ..

మువ్వన్నెల జెండాను ప్రపంచం ముందు తలెత్తకునేలా చేసేందుకు ఇస్రో చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ.. శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఎన్నో తీపి గుర్తులను మిగిలిస్తే.. మరికొన్ని చేదు జ్ఞాపకాలను మిగుల్చుతున్నాయి. అయితే ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగంలో కూడా ఆధ్యాంతం విజయం సాధిస్తుందనుకున్న వేళ.. చిట్ట చివరి క్షణం ఇస్రో శాస్త్రేవత్తలనే కాదు.. యావత్ భారత ప్రజలను ఆవేదనకు గురిచేసింది. మరో క్షణంలో చందమామపై విక్రమ్ ల్యాండ్ […]

దేశం మీ వెంట ఉంది.. ఇస్రో భుజం తట్టి భరోసా ఇచ్చిన మోదీ..
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 10:14 AM

మువ్వన్నెల జెండాను ప్రపంచం ముందు తలెత్తకునేలా చేసేందుకు ఇస్రో చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ.. శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఎన్నో తీపి గుర్తులను మిగిలిస్తే.. మరికొన్ని చేదు జ్ఞాపకాలను మిగుల్చుతున్నాయి. అయితే ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగంలో కూడా ఆధ్యాంతం విజయం సాధిస్తుందనుకున్న వేళ.. చిట్ట చివరి క్షణం ఇస్రో శాస్త్రేవత్తలనే కాదు.. యావత్ భారత ప్రజలను ఆవేదనకు గురిచేసింది. మరో క్షణంలో చందమామపై విక్రమ్ ల్యాండ్ అవుతుందనుకున్న వేళ సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో చంద్రయాన్2లో సాంకేతిక సమస్య తలెత్తి ల్యాండర్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. అయితే చంద్రయాన్2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ.. శాస్త్రవేత్తలకు అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

దేశం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వెలకట్టలేదన్నారు. భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు దేశం సెల్యూట్‌ చేస్తుందన్నారు. ఇక చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారన్నారు. ప్రస్తుతం సైంటిస్టుల మానసిక స్థితిని మేం అర్థం చేసుకోగలమని.. మీ కృషి ఎప్పటికీ వమ్ము కాదని భరోసా ఇచ్చారు. మీ వెనకే కోట్లాది మంది భారతీయులు మద్దతు ఉందని.. మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో అర్థమవుతుందన్నారు.

దేశం మీ వెంటే ఉంటుందని.. దేశ ప్రజల కలను సాకారం చేసేందుకు ఎంతో శ్రమించారన్నారు. ఇలాంటి సమయాల్లోనే మరింత వివేకాన్ని ప్రదర్శించాలని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని మీతో పాటు మేము ఎంతగానో ఆకాంక్షించామన్నారు. కానీ జయా పజయాలను ధైర్యంగా స్వీకరించాలన్నారు. మీ కష్టం మీ కళ్లలో కనిపిస్తోందని.. మీరు చేసిన ప్రయోగాలు ప్రతి భారతీయుడూ గర్వంగా తలెత్తుకునేవంటూ ధైర్యం చెప్పారు. యావత్ భారతం మీకు సంఘీభావంగా రాత్రంతా మేల్కొనే ఉందని.. ఇది ఏ మాత్రం తక్కువ కాదని.. మీ ప్రయత్నానికి జాతి గర్విస్తోందని తెలిపారు.

మన విజయాలకు మరిన్ని భారీ లక్ష్యాలను పెట్టుకోవాలని.. ప్రతి సందర్భంలోనూ మన సత్తా చాటుదామన్నారు. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు మనల్ని మరింత ధృఢంంగా తీర్చిదిద్దుతాయన్నారు. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతోపాటు.. సాగించిన కృషిని కూడా గుర్తించాలన్నారు. చంద్రయాన్‌ 2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయత్నాలు చేశారని సగర్వంగా చెప్పగలనంటూ మోదీ అన్నారు. అనంతరం అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో కలిసి మాట్లాడారు. అందరితో కరచలనం చేసి.. ధైర్యం తెలిపారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..