దేశంలో కరోనా వ్యాప్తి ఇలా ఉంది…

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాాగుతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 54,366 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కి చేరింది. నిన్న ఒక్క రోజే 690 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

  • Sanjay Kasula
  • Publish Date - 10:59 am, Fri, 23 October 20

Marginal Improvement : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాాగుతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 54,366 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కి చేరింది. నిన్న ఒక్క రోజే 690 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,17,306 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా 73,979 మంది మహమ్మారిని జయించగా… ఇప్పటివరకు వ్యాధి బారి నుంచి 69,48,497  మంది కోలుకున్నారు. దేశంలో రికవరీల సంఖ్య భారీగా పెరగడం ఊరటనిచ్చే విషయం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,61,312గా ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,95,509గా ఉంది. ఇక గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన 14,42,722 కోవిడ్‌ టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 10,01,13,085గా ఉంది.