భార‌త్‌లోనే ఎక్కువ‌గా రోజువారీ కోవిడ్ కేసులు న‌మోదుః WHO వ్యాఖ్య‌లు

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) వ‌రుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతూ ప్ర‌పంచ దేశాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు, ప‌లు సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూనే ఉంది. తాజా బ్రీఫింగ్‌లో కోవిడ్ మ‌హ‌మ్మారి గురించి మ‌రోసారి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు..

భార‌త్‌లోనే ఎక్కువ‌గా రోజువారీ కోవిడ్ కేసులు న‌మోదుః WHO వ్యాఖ్య‌లు
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2020 | 3:12 PM

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) వ‌రుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతూ ప్ర‌పంచ దేశాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు, ప‌లు సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూనే ఉంది. తాజా బ్రీఫింగ్‌లో కోవిడ్ మ‌హ‌మ్మారి గురించి మ‌రోసారి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది డ‌బ్ల్యూహెచ్‌వో. క‌రోనా వైర‌స్‌ని త‌రిమికొట్ట‌గ‌ల‌మ‌నే ఆశ‌లు చిగురిస్తున్నాయ‌ని తెలిపింది. అదే విధంగా ఈ మ‌హమ్మారి గురించి త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌ద‌ని అన్ని దేశాలూ గుర్తించుకోవాల‌ని పేర్కొంది. కాగా అమెరికా, బ్రెజిల్‌లో కంటే ఇండియాలోనే కోవిడ్ రోజువారీ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం క‌రోనా పాజిటివ్ కేసుల విష‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా భారత్ 3వ స్థానంలో ఉన్న విష‌యం తెలిసిందే.

ఇక కంగారు ప‌డ‌టం ద్వారా క‌రోనా పోద‌నీ, ఆ వైర‌స్ పోవ‌డానికి ప్ర‌జ‌లు, ప్ర‌పంచ దేశాలూ క్ర‌మ శిక్ష‌ణ‌తో ఉండాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో సూచించింది. అలా చేస్తే క‌నుక ఈ వైర‌స్ వ్యాప్తిని కాస్త అడ్డుకోవ‌చ్చు. అంతం చేయ‌డానికి రాకెట్ సైన్ త‌ర‌హా విధానం కుద‌ర‌దు. ఇక ఇప్ప‌టికే ఉన్న మందులు, ప‌ద్ద‌తుల ద్వారా క‌రోనాకి అనుకున్న‌దానిక కంటే బాగానే బ్రేక్ వేశామ‌ని వివ‌రించింది. అలాగే వాతావ‌ర‌ణ మార్పుల ద్వారా ఈ మ‌హ‌మ్మారి పోద‌నీ, ఎండ‌, వాన‌, చ‌లి ఇలా ఏ వాతావ‌ర‌ణంలోనేనా క‌రోనా వైర‌స్ బ‌తుకుతోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర ప‌వ‌ర్ ఫుల్ పోలియో, త‌ట్టు (మీజిల్స్) వ్యాక్సిన్లు ఉన్నాయి. కానీ ఇప్ప‌టికీ ఆ వ్యాధుల‌ను పూర్తిగా పోగొట్టేందుకు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంద‌న్న డ‌బ్ల్యూహెచ్‌వో.. క‌రోనాకు కూడా వ్యాక్సిన్ వ‌చ్చినా పూర్తిగా పోతుంద‌ని అనుకోలేమ‌ని పేర్కొంది. ఇక క‌రోనా త‌ర‌హా వైర‌స్‌ల‌కూ చెక్ పడుతుందా అన్న ప్ర‌శ్న‌కు కూడా స‌రైన స‌మాధానం లేద‌ని తెలిపింది. ఏదిఏమైనా, ఎప్ప‌టికైనా ప‌లు నియమాలు పాటించ‌డం ద్వారానే భవిష్య‌త్తులో కూడా క‌రోనాను ఎదుర్కొన‌గ‌ల‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌.

Read More:

‘క‌రోనా’ అనుభ‌వాలు మ‌న‌కు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోవిడ్‌తో ప్ర‌ముఖ సినీ నిర్మాత మృతి