నేపాల్‌కు భారత్‌ వెంటిలేటర్ల సాయం

పొరుగు దేశమైన నేపాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నేపాల్‌ను వైద్యపరంగా ఆదుకునేందుకు భారత్‌..

నేపాల్‌కు భారత్‌ వెంటిలేటర్ల సాయం
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 4:34 AM

పొరుగు దేశమైన నేపాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నేపాల్‌ను వైద్యపరంగా ఆదుకునేందుకు భారత్‌ ముందడుగు వేసింది. ఈ క్రమంలో పది వెంటిలేటర్లను సాయం చేసింది. నేపాల్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపాకు పది వెంటిలేటర్లను అందజేశారు.

నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో.. ఈ వెంటిలేటర్ల అందజేత కార్యక్రమం జరిగింది. వీటి విలుల దాదాపు రూ.2.8 కోట్లు ఉంటుంది. ఇదిలావుంటే.. నేపాల్ ప్రధాని ఓలి శర్మ భారత్ పట్ల నిత్యం వ్యతిరేకతతో ఉంటున్నప్పటికీ.. భారత్‌ మాత్రం ఇలా బాసటగా నిలవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆత్మనిర్బర్‌ భారత్‌ కార్యక్రమంలో దేశీయంగా తయారు చేసిన వెంటిలేటర్లను నేపాల్‌కు అందజేసింది.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు