ఐరాసలో కాశ్మీర్ పై మళ్ళీ పాకిస్తాన్ దుష్ప్రచారం, ఎదుర్కోనున్న ఇండియా

ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం ద్వారా ఇండియాపై మళ్ళీ వ్యతిరేక ప్రచారానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 75 వ  యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిబేట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించి ఇండియాను ఇరకాటాన పెట్టడానికి...

ఐరాసలో కాశ్మీర్ పై మళ్ళీ పాకిస్తాన్ దుష్ప్రచారం, ఎదుర్కోనున్న ఇండియా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2020 | 11:23 AM

ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం ద్వారా ఇండియాపై మళ్ళీ వ్యతిరేక ప్రచారానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 75 వ  యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిబేట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించి ఇండియాను ఇరకాటాన పెట్టడానికి ఆ దేశం కుయుక్తి పన్నుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రీ కాశ్మీర్ (కాశ్మీర్ ని విముక్తం చేయండి) పేరిట ఆన్ లైన్ ద్వారా పాక్ ఈ దుర్మార్గానికి పాల్పడుతోందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఐరాసలో ఉన్నత స్థాయి జనరల్ డిబేట్ ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనుంది. ఇదే సమయమనుకుని పాక్ లోని ఇమ్రాన్ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ ప్రచారం చేయనుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఇలా భారత వ్యతిరేక ప్రచారానికి ఆ దేశం పూనుకొంటోందని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 25 న, ఆ మరుసటిరోజున భారత ప్రధాని మోదీ..ఐరాస డిబేట్ లో పాల్గొననున్నారు. కాగా  పాక్ దుష్ట పన్నాగాలను ఎదుర్కొనేందుకు ఇండియా అన్ని విధాలా యత్నిస్తోందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి త్రిమూర్తి వెల్లడించారు. తమకు ముందే ఆ దేశ వైఖరి గురించి తెలుసునని ఆయన చెప్పారు.