India cricket: బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సునీల్ జోషి

టీమిండియా క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) ఛైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నియమితులయ్యారు. ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియగా.. వారి స్థానాల భర్తీ కోసం భారత

India cricket: బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సునీల్ జోషి
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2020 | 6:31 PM

India cricket: టీమిండియా క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) ఛైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నియమితులయ్యారు. ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియగా.. వారి స్థానాల భర్తీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో.. భారత మాజీ క్రికెటర్ల‌తో సహా మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు.

కాగా.. చీఫ్ సెలక్టర్, సెలక్టర్ పదవి కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ).. వడపోత అనంతరం ఓ ఐదుగుర్ని మాత్రమే ఇంటర్వ్యూలకి పిలిచింది. ఇందులో సునీల్ జోషి, వెంకటేశ్ ప్రసాద్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్, హర్విందర్ సింగ్ ఉన్నారు. వీరికి ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించిన క్రికెట్ సలహా కమిటీ.. చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషి, సెలక్టర్‌గా హర్విందర్‌ సింగ్‌ పేర్లని బీసీసీకి ప్రతిపాదించింది. సెలక్టర్ల ఎంపిక కోసమే ఇటీవల బీసీసీఐ.. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణలతో కూడిన క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు.. దక్షిణాఫ్రికాతో మార్చి 12 నుంచి భారత్ జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుండగా.. కొత్తగా ఎంపికైనా సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌కి టీమ్‌ని ఎంపిక చేయనుంది. వాస్తవానికి చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కార్ ఎంపికవుతాడనే వార్తలు వచ్చాయి. కానీ.. అనూహ్యంగా అతను కనీసం తుది జాబితాలో కూడా చోటు దక్కించుకోలేపోయాడు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?