Breaking News
  • ఎల్ 1 గా షాపూర్జీ-పల్లొంజీ: సనీకృత కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఖరారు. బిడ్లలో ఎల్ 1 గా నిలిచి నిర్మాణం పనుల టెండర్ ను చేజిక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ-పల్లొంజీ. 12 నెలలలోపు నిర్మాణం పనులు పూర్తి చేయాలనే కచ్ఛితమైన నిబంధనను పెట్టిన ప్రభుత్వం. టెండర్లు ఖరారైన నేపథ్యంలో ప్రభుత్వం - షాపూర్జీ-పల్లొంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం. చివరివరకు బరిలో నిలిచిన మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ.
  • స్థానిక ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం తెలిపిన ఏపీ అధికారులు. ఈసీతో సీఎస్‌ నీలంసాహ్ని, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ భేటీ. ఎన్నికల నిర్వహణ కష్టమని ఎస్‌ఈసీకి స్పష్టం చేసిన ఏపీ అధికారులు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు వివరిస్తూ నివేదిక. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కానీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అధికారులు, ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. 11 వేల మందికిపైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే.. సమాచారమిస్తామని ఎస్‌ఈసీకి ఏపీ అధికారుల నివేదిక.
  • కామారెడ్డి జిల్లా: జిల్లా పరిధిలోని అడ్లూర్ గ్రామంలో పాత కక్షలతో ఒకే కుటుంబానికి చెందిన ఇరు వర్గాల దాడి. తన పొలంలో మరో కుటుంబానికి చెందిన వారు గేదెలు మేపుతున్నారని దాడి. ఇదే క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. పోలీస్ స్టేషన్ లో ఇరు కుటుంబ సభ్యుల పిర్యాదు.
  • అమరావతి: అనంతపురం పోలీసులను అభినందించిన డీజీపీ సవాంగ్. కిడ్నాపర్ల చెర నుంచి వైద్యుడిని కాపాడిన అనంతపురం పోలీసులు. నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల పనితీరుకు ఈ ఘటన ఒక ఉదాహరణ. ప్రజల రక్షణ కోసం ఏపీ పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. -ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్.
  • కరీంనగర్‌: జమ్మికుంట మండలంలో మంత్రి ఈటల పర్యటన. జగయ్యపల్లెలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. రైతు తెచ్చిన ధాన్యాన్ని ఇబ్బందులు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలి. రైతులు, మిల్లుల యజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలి. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు-ఈటల.
  • హైదరాబాద్‌: గాంధీనగర్‌ పీఎస్‌లో ఏసీబీ సోదాలు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై లక్ష్మీనారాయణ.
  • వికారాబాద్:దామగూడెంలో ఫామ్ హౌజ్‌ను పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాస్‌. నిర్వాహకుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు. ఆవుపై కాల్పులు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు. గోమాతపై కాల్పుల వెనుక కుట్ర కోణం ఉందంటూ స్వామీజీల ఆగ్రహం. రెండు రోజుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ హామీ.
  • జగిత్యాల: యువతి హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదు. ముగ్గురికి జీవితఖైదు విధించిన జగిత్యాల జిల్లా అదనపు కోర్టు. 2015లో ఎన్గుమట్లలో మౌనశ్రీని హత్యచేసిన కుటుంబం.

దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్

గత కొద్దిరోజులుగా లక్షకు చేరువగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుమొఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,33,185 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో మొత్తంగా 75,083 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

India coronavirus cases today updates total recovery rate increased, దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్

గత కొద్దిరోజులుగా లక్షకు చేరువగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుమొఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,33,185 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో మొత్తంగా 75,083 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గడిచిన మూడు వారాల్లో 76వేల కంటే తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో మంగళవారం నాటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,62,663కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 44లక్షల 97వేల మంది కోలుకోగా, మరో 9లక్షల 75వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షకు పైగా కరోనా బాధితులు ఆరోగ్యంగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అయితే, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సోమవారం దేశవ్యాప్తంగా మరో 1,053 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 88,935కు చేరుకుంది.

దేశంలో గత మూడు రోజులుగా నిత్యం నమోదవుతున్న కేసులు, రికవరీలు బాగానే ఉంటున్నాయి.. కరోనా నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా నిత్యం 90వేలకుపైగా బాధితులు కోలుకొని డిశ్చార్జి అవుతున్నారు. అయితే నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,01,468 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కోలుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 9 లక్షలకు పడిపోయింది. తాజాగా కోలుకున్న వారిసంఖ్యతో పోల్చితే రికవరీ రేటు 80శాతం దాటింది. కాగా, మరో 18శాతం వివిధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరణాల రేటు 1.6శాతంగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిలో భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే స్పష్టంచేసింది.

Related Tags