దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1,141 మరణాలు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,141 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచారు.

దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1,141 మరణాలు
Follow us

|

Updated on: Sep 25, 2020 | 10:14 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,141 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 5,818,570కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 81వేల మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు : 58,18,570

కొత్త కేసులు : 86,052

ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు : 9,70,116

మొత్తం మృతుల సంఖ్య :92,290

ఇక రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, రికవరీ రేటు క్రమక్రమంగా పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశం.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 81శాతం దాటగా, డెత్ రేటు 1.59శాతంగా ఉంది. అయితే, ఈ వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలో దాదాపు 70శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.

Also Read :

వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు, ఇకపై ‘హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ !