Breaking News
  • కర్నూల్ : శ్రీశైలం సున్నిపెంట లో స్కూలు లో కరోనా పరీక్షలు చేయగా 29 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో జిల్లావ్యాప్తంగా అన్ని స్కూళ్లలో టెస్టులు చేయాలని ఆదేశించిన డిఈవో సాయిరాం స్కూళ్లలో కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశం.
  • తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు సాయికుమార్. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సెల్యూట్ చేసిన సాయికుమార్. నిజమైన హీరోలు పోలీసులే, పోలీసు గెటప్ వేస్తే నే మాలో‌ ఒక పౌరుషం కనిపిస్తుంది. నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో. పోలీస్ స్టోరి చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది..త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నా. తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి పై ప్రసంశల కురిపించిన సాయి కుమార్. పోలీస్ అధికారి యూనిఫామ్ లో పొలంలో వరినాటడం నాకు నచ్చింది, ఇలాంటి అధికారి ప్రజల్లో ఎలా కలిసిపోతారో అర్ధం చేసుకోవచ్చు. రమేష్ రెడ్డి లాంటి‌ అధికారి ఉన్న చోట మానవత్వం కూడా ఉంటుంది. కనిపించే‌ మూడు సింహాలు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే - సినీ నటుడు సాయి కుమార్.
  • టీవీ 9 ఆపరేషన్ చార్లీ ఎఫెక్ట్ : హైద్రాబాద్ లో మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు . లంగర్ హౌస్ లో నైజీరియన్ దగ్గర 6 గ్రాములు కొకెయిన్ స్వాధీనం . బెంగుళూర్ , గోవా ల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న నైజీరియన్ . టీవీ 9 నిఘా తర్వాత పలువురు నైజీరియన్లు , డ్రగ్ పెడ్లర్ల ఫై నిఘా ఉంచిన హైద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు . రాజేంద్రనగర్ సన్ సిటీ ఏరియా లో డ్రగ్స్ అమ్ముతున్న డానియల్ . డానియల్ ను అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం, రాజమండ్రి కంబాల చెరువు, లాల చెరువు, కడియం, రావులపాలెం, రంపచోడవరం, కోనసీమ, మన్యం ప్రాంతాల్లో భారీ వర్షం, కిర్లంపూడిలో భవనంపై పిడుగు, చుట్టుపక్కల ఇళ్లలో కాలిపోయిన ఎలక్ర్టికల్ పరికరాలు
  • 75 లక్షల 97 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 46,790 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. దేశంలో రెండు నెలల తరువాత మొదటిసారి 50 వేలకు దిగువలో యాక్టివ్ కేసులు. గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 587 మంది మృతి. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 69,720. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 75,97,063. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 7,48,538. “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 67,33,328. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,15,197. దేశంలో 88.63 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.85 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి తగ్గిన మరణాల రేటు. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 10,32,795. ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 9,61,16,771.
  • తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ SI ఆర్ మురళీమోహన్ ను సస్పెండ్ చేసిన ఏలూరు రేంజ్ డిఐజి శ్రీ కె.వి మోహన్ రావు. అన్నవరం పోలీస్ స్టేషన్ గతములో మహిళ అదృశ్యం కేసు విచారణలో అలసత్వం వహించడం పై చర్యలు. ఇదే కేసులో రాజమండ్రి అర్బన్ సిఐ గా పనిచేస్తున్న A. సన్యాసి రావు కు చార్జి మెమో జారీ చేసిన ఏలూరు రేంజ్ డిఐజి మోహనరావు. గతంలో ప్రత్తిపాడు సర్కిల్ సీఐగా పనిచేసిన సన్యాసిరావు.

ఇండియాలో మళ్ళీ భారీగా నమోదైన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,509 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్​లో తెలిపింది.

India Corona Cases As On 14102020, ఇండియాలో మళ్ళీ భారీగా నమోదైన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,509 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్​లో తెలిపింది. మరో 730 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.  71,760 మంది డిశ్చార్జ్  అయ్యారు. కాగా దేశవ్యాప్తంగా  మొత్తం పాజిటివ్ కేసులు 72,39,390కు చేరుకున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,26,877 ఉన్నాయి.  మొత్తం మరణాల సంఖ్య 1,10,586కి చేరింది. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 63,01,928కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, రికవరీ రేటు కూడా భారీగా పెరగడం కాస్త ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 86.36 శాతం ఉండగా..డెత్ రేటు 1.3 శాతంగా ఉంది. ప్రతి మిలియన్​ మందికి గాను అత్యంత తక్కువ కరోనా కేసులు, మరణాలు భారత్​లో నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Also Read :

Breaking : కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య !

హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు

Related Tags