ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజులో 1089 మరణాలు

ఇండియాలో కరోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 86, 432 మందికి వైరస్​ సోకిన‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. మరో 1089 మంది వ్యాధి కార‌ణంగా ప్రాణాలు విడిచారు.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజులో  1089 మరణాలు
Follow us

|

Updated on: Sep 05, 2020 | 10:33 AM

ఇండియాలో కరోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 86, 432 మందికి వైరస్​ సోకిన‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. మరో 1089 మంది వ్యాధి కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఫ‌లితంగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 40,23,179కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 8,46,395 యాక్టీవ్ కేసులున్నాయి. 31,07,223 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 69,561 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. టెస్టుల సంఖ్యనూ గణనీయంగా పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. శుక్రవారం 10,59,346 శాంపిల్స్ టెస్టు చేసిన‌ట్టు పేర్కొంది. మొత్తం టెస్టుల సంఖ్య 4 కోట్ల 77 లక్షలు దాటింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా.. డెత్ రేటు 1.73 శాతంగా ఉంది.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే