Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష మార్క్ ని దాటిన కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 101139. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 58802. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 39174. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3163. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • చెత్త రహిత నగరాల జాబితా విడుదల చేసిన కేంద్రం. వ్యర్థాల నిర్వహణ విషయంలో నగరాలకు స్టార్ రేటింగ్. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నగరాలకు 5-స్టార్ రేటింగ్. ఆ తర్వాత స్థానాల్లో నగరాలకు 3 స్టార్, 1-స్టార్ రేటింగ్. రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 1435 నగరాలు. 10 లక్షల జియో ట్యాగింగ్ ఫొటోలు, ప్రజల ఫీడ్ బ్యాక్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పనితీరు ఆధారంగా రేటింగ్. 1210 మంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పణ. దేశవ్యాప్తంగా 5-స్టార్ రేటింగ్ పొందిన 6 నగరాలు. 5-స్టార్ రేటింగ్ పొందిన నగరాల్లో అంబికాపూర్, రాజ్‌కోట్, సూరత్, మైసూర్, ఇండోర్, నవీ ముంబై. 3-స్టార్ రేటింగ్ పొందిన నగరాలు 65, 1-స్టార్ రేటింగ్ నగరాలు 70. 3-స్టార్ రేటింగ్‌లో ఏపీ నుంచి తిరుపతి, విజయవాడ. 1-స్టార్ రేటింగ్‌లో ఏపీ నుంచి చీరాల, విశాఖ, పలమనేరు, సత్తెనపల్లికి చోటు.
  • బంగాళాఖాతంలో ఏర్పడిన 'అంపన్‌' పెనుతుపాను తీవ్ర భీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను 1999 తరువాత రెండో అతిపెద్దదని తాజాగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావంతో ప్రస్తుతం తీరం వెంబడి 200-240కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ డైరక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్యదిశగా కదులుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో 'అంపన్‌' తుపాన్‌ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమబంగాలోని డిగా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
  • ఓయూ ప్రొఫెసర్ కాశీమ్ కు బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రొఫెసర్ కాశీమ్. గత నాలుగు నెలలలు గా చర్లపల్లి జైలులో ఉంటున్న కాశీమ్. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్ట్. లక్ష రూపాయల రెండు షూరిటీలతో పాటు పోలీసులు దర్యాప్తు కు పూర్తిగా సహకరించాలని రంగారెడ్డి కోర్ట్ అదేశం. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న కాశీమ్. ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్ విడుదల. రేపు బెయిల్ పై చర్లపల్లి జైలు నుండి విడుదల కానున్న ప్రొఫెసర్ కాశీమ్.
  • అమరావతి: మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టుకు ఫిర్యాదు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టు కు అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఇంద్రనీల్. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై అనుబంధ పిటిషన్ దాఖలు. జన సమూహాలతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నిర్వహించిన కార్యక్రమాల వీడియోలు, ఫోటోలు కోర్టుకు అందజేసిన పిటిషనర్ కిషోర్. రేపు విచారణ చేయనున్న హైకోర్టు.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. ఇవాళ రాష్ట్రంలో 42 పాజిటివ్ కేసులు నమోదు. ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం. 1634 కేసులు నమోదు. కరోనా తో ఇవాళ నలుగురు మృతి.

ఇండియాను క‌మ్మేస్తోన్న క‌రోనా.. 24 గంటల్లో 140 మరణాలు

CoronaVirus India Latest Report, ఇండియాను క‌మ్మేస్తోన్న క‌రోనా.. 24 గంటల్లో 140 మరణాలు

ఇండియాలో కరోనా వీర‌విహారం చేస్తోంది. గ‌త‌ 24 గంటల్లో ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ 140 మందిని బ‌లి తీసుకుంది. కొత్తగా రికార్డు స్థాయిలో 5,611 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన క‌రోనా లేటెస్ట్ బులెటెన్ వివ‌రాలు..

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 106750

దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు: 61149

కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 42298

దేశం మొత్తం కరోనా తో మృతి చెందిన‌వారి సంఖ్య‌ : 3303

Related Tags