Breaking News
  • కడపజిల్లా: కడపజిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం. 21 మంది దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్న రాజంపేట పోలీసులు. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు దోపిడీ దొంగల ముఠా స్కెచ్. రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ మేడా మలికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన వైనం. వీరి నుంచి ₹10,360/- నగదు, ఒక పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఒక కారు, మూడు మోటార్ సైకిల్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం. బళ్ళారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడి. వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.
  • నేడు దేశ వ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు. దేశ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 1.51 లక్షల మంది విద్యార్థులు. ఉ.9గంటల నుంచి మ.12 గంటల వరకు పేపర్-1. మ.2:30 నుంచి సా.5:30 వరకు పేపర్‌-2. వచ్చే నెల 5న వెలువడనున్న జేఈఈ ఫలితాలు.
  • విజయవాడ: కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి. ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579 అవుట్ ఫ్లో 3,38,600 క్యూసెక్కులు . వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తంచేసిన జిల్లాకలెక్టర్ ఇంతియాజ్ . ప్రకాశం బ్యారేజి ఎగువన గల పులిచింతల ప్రాజెక్ట్ నుండి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 460000 క్యూసెక్కులు.. వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పెరిగి ప్రకాశం బ్యారేజికి చేరుకునే అవకాశం. ఈ రోజు 11.30 గంటల సమయానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు.
  • ఉగ్రవాది అరెస్ట్‌ : పశ్చిమబెంగాల్‌: ముర్షిదాబాద్‌లో అల్‌ఖైదా ఉగ్రవాది సమీమ్‌ అన్సారీ అరెస్ట్‌ . ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌. ట్రాన్సిట్‌ రిమాండ్‌కు అనుమతిచ్చిన సీజేఎం కోర్టు. అన్సారీని ఢిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్న ఎస్‌టీఎఫ్‌ .
  • దుర్గం చెరువు పై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్. రెండు రోజుల పాటు సందర్శన నిలిపి వేసిన పోలీసులు. ఆదివారం కావడం తో భారీగా దుర్గం చెరువు వద్దకు వస్తున్న సందర్శకులు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం తర్వాత సందర్శకులకు అనుమతి నిరాకరణ. కేబుల్ బ్రిడ్జి పైన సెక్యూరిటీ పరమైన ఆక్టివిటీస్ జరుగుతుండడంతో పర్యాటకులను అనుమతించని పోలీసులు. కేబుల్ బ్రిడ్జి ను సందర్శించడానికి వస్తున్న ప్రజలను పోలీసులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్న పబ్లిక్.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • మాజీ కేంద్ర మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ అకాల మృతి పట్ల సంతాపం తెలియ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. శ్రీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన శ్రీ జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు. శ్రీ జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అక్కడ చర్చలు, ఇక్కడ లడాఖ్ వద్ద భారత-చైనా దళాల కాల్పులు

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా మంత్రి వాంగ్ ఈ  ఈ నెల 10 న మాస్కోలో ఉద్రిక్తతల నివారణకు చిరునవ్వుల మధ్య చర్చలు జరుపుతుండగా ఇక్కడ లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద ఉభయ దేశాల సైనికులు..

Warning Shots, అక్కడ చర్చలు, ఇక్కడ లడాఖ్ వద్ద భారత-చైనా దళాల కాల్పులు

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా మంత్రి వాంగ్ ఈ  ఈ నెల 10 న మాస్కోలో ఉద్రిక్తతల నివారణకు చిరునవ్వుల మధ్య చర్చలు జరుపుతుండగా ఇక్కడ లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద ఉభయ దేశాల సైనికులు వార్నింగ్ షాట్స్ పేల్చుకున్నారట.. సుమారు 100 నుంచి 200 రౌండ్ల కాల్పులు జరిగినట్టు సైనికవర్గాలు తెలిపాయి. చైనా దళాలను పట్టించుకోకుండా మన జవాన్లు ధైర్యంగా ఫింగర్ -4 ప్రాంతంలో మిలిటరీ పోస్టును ఏర్పాటు చేశాయి. గతవారం జరిగిన మరో ఘటనలో చైనా సేనలు గాల్లోకి కాల్పులు జరిపారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అటు-సైనిక, దౌత్య స్థాయిల్లో ఉభయదేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, పాంగాంగ్ సరస్సు మాత్రం పరస్పర కాల్పులతో ‘ఉలిక్కిపడుతూనే ఉంది.

 

 

Related Tags