Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

ఎన్‌సీఏ హెడ్‌గా ద్రవిడ్

India Cements job delays Rahul Dravid’s elevation to NCA head, ఎన్‌సీఏ హెడ్‌గా ద్రవిడ్

టీమిండియా అండర్ 19 మరియు ఇండియా ‘ఏ’ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న రాహుల్ ద్రవిడ్‌ పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ఇన్‌చార్జిగా ద్రవిడ్ నియమితుడయ్యాడు. రెండేళ్లపాటు ఇదే పదవిలో కొనసాగనున్న ద్రవిడ్‌ సోమవారం నుంచి బాధ్యతలను స్వీకరించనున్నాడు. దీంతో పాటు ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇన్నాళ్లు జూనియర్ పురుషుల క్రికెట్‌కు దన్నుగా నిలబడ్డ ద్రవిడ్..ఎన్‌సీఏలో యువ క్రికెటర్లను తీర్చిదిద్దనున్నాడు. ప్రస్తుత, మాజీ క్రికెటర్లకు సంబంధించిన పరస్పర విరుద్ధ ప్రయోజనం అంశంపైనా సీఓఏ చర్చించింది. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులుగా ఉన్న సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌ ఐపీఎల్‌ జట్లు ఢిల్లీ, హైదరాబాద్‌కు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. గంగూలీ వీటితో పాటు బెంగాల్‌ క్రికెట్‌ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రస్తుతం వరల్డ్‌క్‌ప్‌లో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న గంగూలీ, లక్ష్మణ్‌..ఈ పదవుల్లో ఏదో ఒకటి దానిలో మాత్రమే కొనసాగాలని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. బీసీసీఐ నియామళి ప్రకారం ద్రవిడ్ ఇండియా సిమెంట్స్ వైస్ లేదా జాతీయ క్రికెట్‌ అకాడమీ ఇన్‌ఛార్జ్ ఈ రెండీటీలో ఒక పదవిలో మాత్రమే ద్రవిడ్ కొనసాగాల్సి ఉంది.

Related Tags