లడాఖ్ వద్ద మళ్ళీ చైనా చొరబాట్లు, అడ్డుకున్న భారత దళాలు

లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29-30 రాత్రి వేళల్లో చైనా సైనికులు చొరబాటుకు యత్నించారని...

లడాఖ్ వద్ద మళ్ళీ చైనా చొరబాట్లు, అడ్డుకున్న భారత దళాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 31, 2020 | 12:29 PM

లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29-30 రాత్రి వేళల్లో చైనా సైనికులు చొరబాటుకు యత్నించారని, ముఖ్యంగా కొత్త ప్రాంతమైన ఈ లేక్ ముందుకు చొచ్ఛుకు వచ్చారని సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే భారత జవాన్లు అప్రమత్తమై వారి ప్రయత్నాలను అడ్డుకున్నట్టు ఈ వర్గాలు వివరించాయి. లడాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతల నివారణకు ఓ వైపు ఉభయ దేశాల మధ్య మిలిటరీ, దౌత్య స్థాయుల్లో చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా మరో వైపు పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ చైనీస్ ఆర్మీ  వాటిని నీరు గార్చడానికి, కుదురుతున్న ఏకాభిప్రాయానికి గండి కొట్టేందుకు యత్నించడాన్ని సైనిక వర్గాలు తీవ్రంగా ఖండించాయి.

ముందు జాగ్రత్త చర్యగా పాంగాంగ్ సో సరస్సు వద్ద మరిన్ని భారత బలగాలను మోహరించారు. ఇప్పటివరకు ఉన్న సంఖ్య కన్నా మరింత ఎక్కువగా దళాలను నియోగించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.