Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

సంక్షోభంలో ఆటో మొబైల్ రంగం.. అమ్మకాలు డీలా.. ఉద్యోగుల ఉద్వాసన

India auto sales decline for 10th straight month worst slump in two decades, సంక్షోభంలో ఆటో మొబైల్ రంగం.. అమ్మకాలు డీలా..  ఉద్యోగుల ఉద్వాసన

భారతీయ ఆటోమోబైల్ ఉత్పత్తుల అసోసియేషన్ గణాంకాలు ప్రస్తుతం నివ్వెరపరుస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత నెలలో ప్యాసింజర్ వాహనాలు, ఇతర వాహనాల అమ్మకాలు విపరీతంగా పడిపోయినట్టు తేలింది. గత పదినెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. ఆగస్టు నెలలో మాత్రం అమ్మకాలు మరింత క్షీణించాయని సియామ్ వెల్లడించింది. వరసబెట్టి పది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ దేశీయ ఆటో పరిశ్రమ కుదేలవడం ఆలోచింపజేసే అంశంగా తెలుస్తోంది.

1997 98 నుంచి డేటాను అమ్మకాలు, కొనుగోలు రికార్డు చేయడం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటికి ఇదే అతిపెద్ద క్షీణతగా నివేదిక వెల్లడించింది. అమ్మకాలు ఊహించని విధంగా తగ్గడంతో ఆయా ఆటోమొబైల్ సంస్ధలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు 15వేల మందిని తొలగించాయి. దీంతో వీరంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మూడు నెలల కాలంలో దాదాపు 300 డీలర్ ఫిప్‌లు మూతపడ్డాయి. తమ వద్ద పని చేస్తున్న దాదాపు 2.8 లక్షలమందిని దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు తొలగించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 10 లక్షల మంది తమ ఉద్యోగాలు పోగుట్టుకోవడం ఖాయమనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

దేశంలో ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.దీంతో దేశీయంగా కార్లను తయారీ చేస్తున్న అతిపెద్ద సంస్ధ మారుతీ సుజుకీ గత వారంలో హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ ప్రాంతాల్లో ఉన్న తమ ప్లాంట్లలో ఉత్పత్తిని అమాంతం నిలిపివేసింది. మారుతీ బాటలో హెవీ వెహికల్స్ తయారీ సంస్ధ అశోక్ లేలాండ్స్ కూడా తమ ఉద్యోగులకు 16 రోజుల పాటు పనిదినాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని, ఆటోమొబైల్ తయారీ సంస్ధలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందువల్ల ఎలాగైనా సమస్య నుంచీ గట్టెక్కాలని ఆలోచనతో ఈ కంపనీకి చెందిన ఐదు ప్లాంట్లలో… నాన్ వర్కింగ్ డేస్ ప్రవేశపెట్టింది. ఈ నెలలోనే ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం… ఎన్నోర్ ప్లాంట్‌లో ఈ నెలలో 16 నాన్ వర్కింగ్ డేస్ ప్రకటించింది. అలాగే అళ్వార్, భండారా ప్లాంట్లలో 10 రోజులు, పంత్‌నగర్ ప్లాంట్‌లో ఏకంగా 18 రోజులు,హోసూర్ 1, 2 ప్లాంట్లు,సీపీపీఎస్ లో ఐదు రోజులు, నాన్ వర్కింగ్ డేస్ ప్రకటించింది.

ప్రయాణీకులను చేర్చే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది 31.57 శాతం పడిపోయి గత నెలలొ 196,524 యూనిట్లకు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో ముఖ్యంగా బస్సులు, ట్రక్కుల అమ్మకాలు 39 శాతం పడిపోగా, టూ వీలర్ అమ్మకాలు 22 శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరాయి. ఇదిలా ఉంటే ఈ ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం 14. 73 శాతం పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

భారతీయ ఆటో మొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే విధానపరమైన నిర్ణయాలను తీసుకోవా భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) డిమాండ్ చేస్తోంది. ఈ రంగానికి సంబంధించి వస్తు, సేవల పన్ను తగ్గింపు, స్క్రాపేజ్‌ పాలసీ వంటి నిర్ణయాలను వెంటనే తీసుకుని ఈ పరిశ్రమకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సియామ్ కోరుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం ఉన్న జీఎస్‌టీ రేటును 18 శాతానికి తగ్గించాలని సియామ్ గతంలో కోరగా.. దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయాన్నిఇంకా ప్రకటించలేదు. జీఎస్టీ రేటు తగ్గితే వాహన ధరలు భారీగా తగ్గి డిమాండ్‌ మళ్లీ పెరిగేందుకు అవకాశం ఉందని సియామ్ భావిస్తోంది.

Related Tags