అమెరికాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

India Association of North Texas IANT celebrates 73rd Independence Day, అమెరికాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నార్త్ టెక్సాస్‌లోని ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. డాలస్‌ ఫోర్ట్‌వర్త్‌ మెట్రోఫ్లెక్స్‌లోని 67 ప్రవాస భారతీయ సంస్థలు ఈ వేడుకల్లో పాల్పంచుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌ ర్యాలీలో ప్రవాస భారతీయులాంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలో మన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు టాంటెక్స్‌ అధ్యక్షుడు చిన సత్యం వీరపునేని, ఎలెక్ట్‌ ప్రసిడెంట్‌ కృష్ణారెడ్డి కోడూరు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పరేడ్‌కు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 43వ వార్షక ఆనంద్‌ బజార్‌ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా తాము ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని IANT అధ్యక్షుడు నరసింహ భక్తుల, కోశాధికారి మహేంద్ర ఘనపురం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *