గుడ్‌న్యూస్‌.. రూ.500/- కే “కరోనా టెస్ట్”‌.. అయితే ఇంకా…

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య వేలల్లో ఉండటం.. కలకలం రేపుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు చేయడంలో ఆలస్యం చోటుచేసుకుంటుంది.ఈ క్రమంలో యూపీలోని సంజయ్‌ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ కొత్త సాంకేతికను డెవలప్ చేసింది.

గుడ్‌న్యూస్‌.. రూ.500/- కే కరోనా టెస్ట్‌.. అయితే ఇంకా...
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 6:59 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ దిశగా వెళ్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో ఉండటం.. కలకలం రేపుతోంది. అయితే అనేక రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు చేయడంలో ఆలస్యం చోటుచేసుకుంటుంది. చేసిన తర్వాత రిపోర్టులు రావడానికి 24 గంటల సమయం కూడా పడుతోంది. ఈ క్రమంలో యూపీలోని లక్నోకి చెందిన సంజయ్‌ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ కొత్త సాంకేతికను డెవలప్ చేసింది. కరోనా వైరస్‌ను గుర్తించేందుకు తక్కువ ఖర్చుతో పాటు.. అత్యల్ప సమయంలోనే రిపోర్టులు వచ్చే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ కొత్త టెక్నాలజీతో రూ.500/- ఖర్చుతో కరోనా టెస్ట్ చేయవచ్చు. అంతేకాదు.. రిపోర్టులు కూడా ముప్పై నిమిషాల్లో వచ్చేస్తాయి. ఆర్ఎన్‌ఏ ఆధారంగా ఈ విధానంలో కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అయితే దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) నుంచి గ్రీన్‌ సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్ పద్దతిలో కరోనా టెస్టులు జరుపుతున్నారు. ఈ విధానంలో దాదాపు రూ.5 వేల వరకు ఖర్చు అవుతోంది. అయితే ప్రస్తుతం సంజయ్‌ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ తీసుకొచ్చిన విధానానికి గ్రీన్‌ సిగ్నల్ లభిస్తే.. ఇక కరోనా పరీక్షల ఖర్చు భారీగా తగ్గనుంది.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..