కరోనా దూకుడు.. ఒక్క రోజులో 9851 న్యూ కేసులు.. 273 మరణాలు

భారత్‌లో కరోనా కేసులు ఊహిచనంత వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం 9,851 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,770కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 273 మంది చనిపోగా.....

కరోనా దూకుడు.. ఒక్క రోజులో 9851 న్యూ కేసులు.. 273 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 10:44 AM

భారత్‌లో కరోనా కేసులు ఊహిచనంత వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం 9,851 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,770కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 273 మంది చనిపోగా.. మొత్తం 6,348 మంది మరణించారు. అలాగే ప్రస్తుతం 1,10,960 కేసులు యాక్టీవ్‌‌గా ఉండగా, 1,09,461 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 43,86,376 శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు.

కాగా నిన్న రాష్ట్రాల వారీగా నమోదైన మరణాల్లో.. మహా రాష్ట్రలో 123 మంది, ఢిల్లీలో 44, గుజరాత్‌లో 33, ఉత్తర ప్రదేశ్‌లో 16, తమిళనాడులో 2, బెంగాల్‌ 10, తెలంగాణలో 6, మధ్యప్రదేశ్‌లో 6, కర్ణాటకలో 4, బీహార్‌‌లో 4, రాజస్థాన్‌లో 4, ఆంధ్రప్రదేశ్‌లో 3, కేరళలో 3, ఉత్తరాఖండ్‌లో 2, జమ్ముకశ్మీర్‌లో 1‌, హరియాణాలో 1, ఝార్ఖండ్‌లో ఒకరు మరణించారు. ఇక భారత్‌లో రాష్ట్రాల వారీగా.. మహారాష్ట్రలో 77,793, తమిళనాడులో 27,256, ఢిల్లీలో 25,004, గుజరాత్‌లో 18,584 కేసులు అత్యధికంగా ఉన్నాయి.

తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..