డాలస్‌లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Independence Day celebration by MGMT in Dallas, డాలస్‌లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ఇండియాలోనే కాదు. అమెరికాలోనూ దేశభక్తి ఉప్పొంగింది. డాలస్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. MGMNT ఆధ్వంర్యంలో భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఇర్వింగ్‌ మహాత్మాగాంధీ మెమోరియల్‌ థామస్‌ జెఫర్‌సన్‌ పార్క్‌లో జాతీయజెండాను ఎగురవేశారు MGMNT ప్రెసిడెంట్‌ తోటకూర ప్రసాద్‌. అనంతరం చిన్నారులు ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో MGMNT సెక్రటరీ రావ్‌ కలువుల, DFW మెట్రోఫ్లెక్స్‌లో వివిధ స్కూల్స్‌లో కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌తో పాటు ముఖ్య అతిథిగా ఇర్వింగ్‌ మేయర్‌ ఆస్కార్‌ వార్డ్‌ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించిన అనంతరం పలు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ను ఘనంగా సన్మానించారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టారని బాపూజీని కొనియాడారు నిర్వాహకులు. ఎంతోమంది మహాత్ముల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇంతమంది ఎన్నారైల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఇండిపెండెన్స్‌ డే ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఇర్వింగ్‌ మేయర్‌ ఆస్కార్‌ వార్డ్‌. ఈ కార్యక్రమంలో తానూ భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *