పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు:

Independence day 2019: Highlights of PM Modi Speech from Red Fort

ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నల జెండా ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఇది ఆరవ సారి. ముందుగా ఆయన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

మోదీ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు దేశమంతా పర్యటించాన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలు ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. వ్యవస్థలను గాడిలో పెట్టాం, వేగవంతంగా పనిచేసేలా చూస్తున్నామన్నారు. దేశం అభివృద్ధి చెందుతుందా..! దేశంలో మార్పు వస్తుందా..! అని ప్రజలు సందేహిస్తున్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశం మారుతోంది. ఈ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

1. సబ్‌ కా సాధ్.. సబ్‌ కా వికాస్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.
2. రెండోసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేశాం
3. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను తీర్చాం
4. సర్ధార్ వల్లభాయ్ పటేల్ కలలను నెరవేరుస్తున్నాం
5. అవినీతిని అంతమొందించే ప్రత్యేక చర్యలు తీసుకొచ్చాం
6. దేశంలో కొత్త సంస్కరణలను తీసుకొచ్చాం
7. ఒకే దేశం – ఒకే రాజ్యాంగం అనే కలను సాకారం చేశాం
8. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాం
9. సాగునీటి వనరుల అభివృద్ధికి జల్‌ శక్తి అభియాన్ ఏర్పాటు
10. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరువేరస్తా
11. జీఎస్టీ రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *