Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు లేఖ రాసిన డాక్టర్ సుధాకర్. తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన. మెరుగైన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి వెళ్ళేందుకు అనుమతించాలని విజ్ఞప్తి.
  • ఢిల్లీ మే 31 వ తేదీ మోడీ మన్ కీ బాత్‌ కార్యక్రమం. మన్ కి బాత్ లో ...లాక్ డౌన్ 5.0 పై ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం. లాక్ డౌన్ 4.0 చివరి రోజు మే 31. పిఎం మోడీ తన ప్రసంగంలో లాక్డౌన్ స్ఫూర్తిని , దేశంలో చాలా ప్రాంతాల్లో మరింత సడలింపులు వంటి వాటి పై మాట్లాడే అవకాశం ఉందంటున్న విశ్వసనీయ వర్గాల సమాచారం.
  • కరోనా నుంచి కోలుకున్న ఒక నెల పసిపాప. ముంబై లోని సియాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు. పసిపాప కి చప్పట్లు కొడుతూ...సెండ్ ఆఫ్ ఇచ్చిన వైద్యులు, సిబ్బంది.
  • సినిమా షూటింగ్ లు, థియేటర్ ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ యాదవ్.
  • అమరావతి: మహానాడు.. కరోనా వైరస్ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ గల్లా జయదేవ్.. తీర్మానాన్ని బలపరిచిన మాజీ మంత్రి కేఎస్ జవహర్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ 38వ మహానాడు జూమ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడం చూస్తే కరోనా వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇకపై కరోనాకు ముందు తర్వాత అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ క్రైసిస్ లో ఇదే పెద్దది. స్పానిష్ ఫ్లూ వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ.
  • టివి9 తో రైల్వే సిపిఆర్ఓ రాకేష్: ఒకటి నుంచి ప్రయాణించే రైళ్లలో నో మాస్క్ .. నో జర్నీ. మాస్క్ లు లేకుండా స్టేషన్లకు రావొద్దు. ఒకటో తేదీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుండి 32 ట్రైన్స్ . ఢిల్లీ ,హౌరా,గుంటూరు ,వైజాగ్,బాంబే, తిరుపతి,తదితర ప్రాంతాలకు నడపనున్న రైళ్లు. ఇప్పటికే అనేక రైళ్లకు రిజర్వేషన్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు . ప్రయాణాల్లో కోవిద్ 19 నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహరించాలి. దశల వారిగా రైళ్ల ను పెంచేందుకే ప్రయత్నిస్తున్నాం . రైల్వే బుకింగ్స్ దగ్గర నుండి రైళ్లు ఎక్కే వరకూ తిరిగి ప్రయాణికులు బయటకి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో నిబంధనలు . స్టేషన్ కి వచ్చిన ప్రయాణికుడికి థర్మల్ స్కీనింగ్ చేసిన స్టాంపింగ్ వేసి ఇళ్లకు పంపిస్తాం.

Mayank Agarwal Record: 30 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. మయాంక్ ఒక్కడికే సాధ్యమైంది…

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఇదిలా ఉంటే ఓపెనర్ మయాంక్ మాత్రం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు...
IND Vs NZ, Mayank Agarwal Record: 30 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. మయాంక్ ఒక్కడికే సాధ్యమైంది…

IND Vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(34; 84 బంతుల్లో 5×4) మినహాయిస్తే ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే ఓపెనర్ మయాంక్ మాత్రం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి సెషన్ మొత్తం క్రీజులో ఉండి 30 ఏళ్ళ రికార్డును సమం చేశాడు.

Also Read: IPL All Stars Match End Of The Tournament

1990లో కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఓపెనర్ మనోజ్ ప్రభాకర్ మొదటిసారి తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేశాడు. ఇక ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మయాంక్ అగర్వాల్ ఆ ఘనత సాధించాడు. వీరిద్దరిని మినహాయిస్తే మరే భారత్ ఓపెనర్ కూడా న్యూజిలాండ్ గడ్డపై తొలి సెషన్ ఆడిన దాఖలాలు లేవు.

Also Read: Virat Kohli Worst Record

Also Read: T20 Women’s World Cup India Stellar Show In Opening Match

కాగా, ప్రస్తుతం టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. క్రీజులో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(38), రిషబ్ పంత్(10)లు ఉన్నారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జేమీసన్‌ 3 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

Also Read: Prajyan Ojha Retirement

Related Tags