Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

రెండో టీ20: టీమిండియాలో పలు మార్పులు.. జట్టుకు దూరం కానున్న స్టార్ బౌలర్.?

IND Vs NZ, రెండో టీ20: టీమిండియాలో పలు మార్పులు.. జట్టుకు దూరం కానున్న స్టార్ బౌలర్.?

IND Vs NZ 2nd T20: అనుకున్నట్లుగానే కివీస్ టూర్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇరు జట్ల బౌలర్లు తేలిపోయిన వేళ.. బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. ఫస్ట్ టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లకు 203 పరుగులు చేస్తే.. భారత్ ఆ లక్ష్యాన్ని ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఒక్కరూ.. ఇద్దరూ కాదు.. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీలు చేశారు.

ఇప్పుడు రెండో టీ20కు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో భారత్ బరిలోకి దిగుతుంటే.. ఎలాగైనా కోహ్లీసేనపై బదులు తీర్చుకోవాలన్న కసితో కివీస్ పోరుకు సిద్ధమైంది. ఈడెన్ పార్క్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం అన్నది మొదటి మ్యాచ్‌తోనే అర్ధమైంది. దీన్ని బట్టి చూస్తే రెండో మ్యాచ్‌కు మరో పరుగుల పండగేనని చెప్పాలి. కాగా, ఈ టీ20కి భారత్ పలు మార్పులతో రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

బుమ్రాకు గాయం.. సైనీకి పిలుపు.?

ఒక్క మ్యాచ్ తర్వాత జట్టులో మార్పులు చేసి.. విజయాలకు అడ్డుకట్ట వేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు ఆలోచించడు. కానీ మొదటి టీ20లో బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో జట్టులో కీలక మార్పులు చేయాలని చూస్తున్నాడట. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ సైనీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. అలాగే మొదటి మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి బుమ్రా గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే.

దీనితో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా.. లేదా అన్నది మ్యాచ్ మొదలయ్యే ముందు ఫైనల్ చేస్తారని సమాచారం. అటు రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తన స్థాయి చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రాహుల్, కోహ్లీ, అయ్యర్ వాళ్ళ ఫామ్‌ను కొనసాగిస్తే గెలుపు లాంఛనమే అని చెప్పాలి.

IND Vs NZ, రెండో టీ20: టీమిండియాలో పలు మార్పులు.. జట్టుకు దూరం కానున్న స్టార్ బౌలర్.?

Related Tags