ప్రాణహీత ప్రవాహం… గోదావరికి వరద ఉధృతి

గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ప్రాణహితకు వరద ఉధృతి పెరగడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అధికారులు కాళేశ్వరం బ్యారీజీల నుంచి వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు...

ప్రాణహీత ప్రవాహం... గోదావరికి వరద ఉధృతి
Follow us

|

Updated on: Sep 02, 2020 | 5:24 PM

గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ప్రాణహితకు వరద ఉధృతి పెరగడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అధికారులు కాళేశ్వరం బ్యారీజీల నుంచి వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అక్కడి నుంచి భద్రాచలం వైపు గోదారమ్మ పరుగులు పెడుతోంది.

భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు… కాళేశ్వరం త్రివేణి సంగమం ఘాట్‌ వద్ద 12.27 మీటర్ల మేర నీరు చేరడంతో గోదావరి, ప్రాణహిత నదులు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వరద కారణంగా అధికారులు కాళేశ్వరం వద్ద పూజలు, పుణ్యస్నానాలు నిలిపివేశారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో జాలర్లు నధిలోకి వేటకు వెళ్ల వద్దని సూచించారు.