విదేశాలపై తెలుగోడి కన్ను..!

విదేశాలపై భారతీయులకు మక్కువ పెరిగింది. ఓ నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చుననే ఆశతో విదేశాలకు పయనమవుతున్నారు. కొంతమంది ఉన్నత చదువులకోసం వెళ్తుంటే.. మరికొంతమంది సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల వ్యక్తులు దుబాయ్‌కి రెడీ అంటున్నారు. అందులోనూ కొంతమంది నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారు. అయినా.. కూడా విదేశాలపై మమకారం పోవట్లేదు. మన ఒక్క రూపాయికి విదేశాల్లో 10 రెట్లు డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ మాత్రం చావట్లేదు. ముఖ్యంగా యువత విదేశాలకు వెళ్లడానికి బాగా ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాల్లో […]

విదేశాలపై తెలుగోడి కన్ను..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2019 | 5:57 PM

విదేశాలపై భారతీయులకు మక్కువ పెరిగింది. ఓ నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చుననే ఆశతో విదేశాలకు పయనమవుతున్నారు. కొంతమంది ఉన్నత చదువులకోసం వెళ్తుంటే.. మరికొంతమంది సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల వ్యక్తులు దుబాయ్‌కి రెడీ అంటున్నారు. అందులోనూ కొంతమంది నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారు. అయినా.. కూడా విదేశాలపై మమకారం పోవట్లేదు. మన ఒక్క రూపాయికి విదేశాల్లో 10 రెట్లు డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ మాత్రం చావట్లేదు. ముఖ్యంగా యువత విదేశాలకు వెళ్లడానికి బాగా ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాల్లో తెలుస్తోంది.

తాజాగా.. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ నివేదిక ఒకటి విడుదల చేసింది. అందులో 2008-18 సంవత్సర కాలంలో 99.33 శాతం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఉన్నత చదువులు, సాఫ్ట్‌వేర్ రంగం వారు అమెరికా, కెనెడా దేశాలకు తొలిప్రాధాన్యం ఇస్తున్నారని నివేదికలో తెలిపారు. 2008లోనే అమెరికా, కెనెడాకు 282 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పుడు 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరి అక్కడ జీవిస్తున్న ఇండియన్స్ సంఖ్య 28,489 మంది. అలాగే 2018లో కెనెడా ఆశ్రయాన్ని పొంది అక్కడ జీవిస్తున్న భారతీయుల సంఖ్య 5,522 మంది. ఈ సంఖ్యను బట్టి చూస్తే.. 2008 -18ల మధ్య దాదాపు 10 రెట్లు భారతీయులు వలస పోతున్నారు. ఇక దుబాయ్‌లో అయితే.. 30 శాతంకు పైగా భారతీయులు అక్కడకు వెళ్తున్నారని తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..