ఆరోగ్య సేవలకు నిధులు పెంచండి.. భారత సంతతి డాక్టర్ వేడుకోలు

యూకేలో భారత సంతతికి చెందిన ఒక ప్రముఖ డాక్టర్ దేశ ప్రభుత్వ ఆరోగ్య సేవలకు నిధులు సమకూర్చాలని బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను కోరారు. తగినంత పెట్టుబడి లేకుండా, సంక్షోభానికి గురైన జాతీయ ఆరోగ్య విధానంలో నాణ్యమైన సేవలు పొందాలంటే నిధులు అవసరమని తెలిపారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ (బిఎమ్‌ఎ) చైర్మన్ చాంద్ నాగ్‌పాల్ ఓ మెమోను విడుదల చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బోరిస్ జాన్సన్‌ […]

ఆరోగ్య సేవలకు నిధులు పెంచండి.. భారత సంతతి డాక్టర్ వేడుకోలు
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 12:16 AM

యూకేలో భారత సంతతికి చెందిన ఒక ప్రముఖ డాక్టర్ దేశ ప్రభుత్వ ఆరోగ్య సేవలకు నిధులు సమకూర్చాలని బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను కోరారు. తగినంత పెట్టుబడి లేకుండా, సంక్షోభానికి గురైన జాతీయ ఆరోగ్య విధానంలో నాణ్యమైన సేవలు పొందాలంటే నిధులు అవసరమని తెలిపారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ (బిఎమ్‌ఎ) చైర్మన్ చాంద్ నాగ్‌పాల్ ఓ మెమోను విడుదల చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బోరిస్ జాన్సన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. జాన్సన్‌ జాతీయ ఆరోగ్య సేవలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. “సండే టైమ్స్” ప్రకారం, 2023-24 నాటికి.. సంవత్సరానికి 6.2 బిలియన్ పౌండ్ల పెట్టుబడులు అవసరమని తెలుస్తోంది.

నేషనల్ హెల్త్ సర్వీస్ మనుగడ సాగించాలంటే ఆరోగ్య వ్యయంలో ఏటా అదనంగా 4.1 శాతం పెరుగుదల అవసరమని బిఎమ్‌ఎ విశ్లేషణలో తేలింది. అయితే సంవత్సరానికి 3.4 శాతం నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం తెలిపింది. బోరిస్ జాన్సన్ తన ఎన్నికల ప్రచారంలో ఆరోగ్య సేవలకు భారీగా పెట్టుబడులు కేటాయిస్తామమని తెలిపారు. 2023-24 నాటికి నేషనల్ హెల్త్ సర్వీస్ వార్షిక వ్యయంలో 20.5 బిలియన్ పౌండ్ల పెరుగుదలతో కూడిన వివరణాత్మక ఎజెండాను రూపొందించాడు.

దాదాపు ఒక దశాబ్ద కాలం నేషనల్ హెల్త్ సర్వీస్ కు నిధుల లేమి కారణంగా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, సిబ్బంది “భరించలేని ఒత్తిడి” లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. జాన్సన్ తన కొత్త ప్రభుత్వ ఎజెండాలో పోస్ట్-బ్రెక్సిట్ నేషనల్ హెల్త్ సర్వీస్ వీసా ఉంది, ఇది నేషనల్ హెల్త్ సర్వీస్ సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం వంటి దేశాల నుండి అర్హత కలిగిన విదేశీ వైద్యులు, నర్సులను రప్పించేందుకు సులభతరం, ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించబడింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?