IT Raids: ఏపీలో ఐటీ కలకలం.. 2వేల కోట్ల అక్రమ లావాదేవీలు!

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సోదాలఫై ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్ ప్రకటన జారీచేసింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో 2000 కోట్ల లావాదేవీలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. హైద్రాబాద్, విజయవాడ, ఢిల్లీ, పూణే, కడప, వైజాగ్ తో సహా మొత్తం 40 చోట్ల సోదాలు జరిగాయి. మూడు ఇన్ఫ్రాల ద్వారా కోట్లరూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు సేకరించారు అధికారులు. ఇటీవల ఏపీలో టిడిపి నాయకుల […]

IT Raids: ఏపీలో ఐటీ కలకలం.. 2వేల కోట్ల అక్రమ లావాదేవీలు!
Follow us

| Edited By:

Updated on: Feb 13, 2020 | 8:20 PM

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సోదాలఫై ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్ ప్రకటన జారీచేసింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో 2000 కోట్ల లావాదేవీలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. హైద్రాబాద్, విజయవాడ, ఢిల్లీ, పూణే, కడప, వైజాగ్ తో సహా మొత్తం 40 చోట్ల సోదాలు జరిగాయి. మూడు ఇన్ఫ్రాల ద్వారా కోట్లరూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు సేకరించారు అధికారులు. ఇటీవల ఏపీలో టిడిపి నాయకుల సన్నిహితులపై ఐటీ దాడులు జరుపగా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు అకౌంట్లు లేనట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు.

ఈ నెల 6న విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణేలో ఐటీ శాఖ దాడులు జరిపింది. చంద్రబాబు మాజీ పి ఎస్ శ్రీనివాస్ తో సహా మరో మూడు సంస్థలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు. 25 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. బోగస్ బిల్లులతో పాటు, బోగస్ ఇన్వాయిస్ లు, బోగస్ సబ్ కాంట్రాక్టులను అధికారులు గుర్తించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. పన్ను లెక్కలకు దొరకకుండా రూ 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధుల దారి మళ్లించినట్లు గుర్తించారు. బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు.

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..