Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

తమిళనాడులో బయటపడుతోన్న నోట్ల కట్టలు..

Income Tax officials seized huge money in Tamil Nadu, తమిళనాడులో బయటపడుతోన్న నోట్ల కట్టలు..

ఎన్నికల వేళ తమిళనాడు రాష్ట్రంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతోన్నాయి. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం సంచలనం రేపుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు.. ఓటర్లకు పంచేందుకు భారీగా నగదును సీక్రెట్‌గా తరలిస్తున్నాయి.

తమిళనాడులోని తుత్తుక్కుడిలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. తిరుచందూరులో జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల నగదు, 10 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఏడీఎంకే మద్దతు దారుడు, కాంట్రాక్టర్ సెబాస్టియన్ ఇంట్లో జరిపిన దాడుల్లో లభ్యమైన 15 కోట్ల రూపాయల వీడియోలను ఐటీ అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఈ కరెన్సీ వీడియోలిప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి.

పెరంబుదూర్‌లో కూడా భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 2 కోట్ల 10 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. అయితే ఈసీ తనిఖీల్లో పట్టుబడ్డ ఈ నగదు.. వీసీకే పార్టీకి చెందిన ఓ నేతదిగా పోలీసులు గుర్తించారు. ఇనుప ట్రంకు పెట్టెల్లో ఉన్న నగదును ఈసీ అధికారులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.

 

 

Related Tags