కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్ మణిహారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరుకానున్నారు.

కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2020 | 9:59 PM

హైదరాబాద్ మణిహారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరుకానున్నారు. రూ. 184కోట్లతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు.

ఆసియాలోనే రెండవ అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డు కెక్కింది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. కేబుల్ బ్రిడ్జితో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. బ్రిడ్జితో పాటు ఫ్లై ఓవర్‌ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లై ఓవర్‌‌కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేశారు.

ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలా… ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మొత్తం రూ.184 కోట్లను దీని నిర్మాణానికి వ్యయం చేశారు. రెండేళ్ళలో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీకి అప్పగించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే.

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్