ఏపీలో తొలి క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం

ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా ఏపీలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో తొలిసారిగా క్యాన్సర్ కేర్ సెంటర్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది..

ఏపీలో తొలి క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం
Follow us

|

Updated on: Jul 01, 2020 | 12:59 PM

ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా ఏపీలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో తొలిసారిగా క్యాన్సర్ కేర్ సెంటర్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.  గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌లో నాట్కో క్యాన్సర్‌ బ్లాక్ ను  ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ మాట్లాడుతూ..ఏపీ చరిత్రలో ఈ రోజు ప్రత్యేకమైనదిగా చెప్పారు. నాట్కో ఫార్మా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. కర్నూలులో కూడా ఇలాంటిదే మరో ఆస్పత్రి ప్రారంభించబోతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకుని  వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్.

గతంలో గవర్నమెంట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారని సీఎం జగన్ గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి నుండి పూర్తిగా మార్పు తెచ్చామని చెబుతూ..ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. 104, 108 నిర్వహణ దారుణంగా ఉండేదన్నారు. 336 అంబులెన్స్‌లు మాత్రమే గతంలో అందుబాటులో ఉండేవని చెప్పారు. ఈ రోజు 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించామని చెప్పారు. ఇన్ని అంబులెన్స్‌లు ప్రారంభించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు.

గతంలో ఆస్పత్రుల్లో శిశువును ఎలుకలు కొరికే పరిస్థితి ఉండేదని అన్నారు. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ చరిత్రలో ఈ రోజు ప్రత్యేకమైందిగా వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలకు క్యూఆర్ కోడ్ ఆధారంగా హెల్త్ కార్డులు ఇచ్చామని చెప్పారు. రోగుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లు మెయిన్ టెన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెస్తున్నామని తెలిపారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రతి మండలానికి 2పీహెచ్‌సీ సెంటర్లు తెస్తున్నామని చెప్పారు. చిన్నారులు, పసిపిల్లల కోసం ప్రత్యేకంగా జిల్లాకు రెండు చొప్పున నియోనిటల్ అంబులెన్స్‌లు పంపామని తెలిపారు.