రాహుల్ కన్నా! నాడు నిన్నెత్తుకున్నది నేనే..

Rahul Gandhi In Wayanad, రాహుల్ కన్నా! నాడు నిన్నెత్తుకున్నది నేనే..

వయనాడ్‌:  తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు రాహుల్ గాంధీ  వయనాడ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ రాహుల్‌ గాంధీ ఓ పెద్దావిడ ఇంటికి అతిథిగా వెళ్లి ఆమెను ఆశ్చర్యపరిచారు. దశాబ్దాల తరవాత రాహుల్‌ను చూసిన ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా!.. ఉద్యోగవిరమణ చేసి వయనాడ్‌లో నివాసముంటున్న రాజమ్మ వతివాల్‌. రాహుల్‌ పుట్టినప్పుడు అదే ఆసుపత్రిలో ఆమె ట్రైనీ నర్సుగా పనిచేస్తున్నారు. రాహుల్‌ పుట్టగానే ఎత్తుకున్న వారిలో తానూ ఒకరినని రాజమ్మ గతంలో ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నారని తెలిసి రాజమ్మ ఎంతో సంతోషించారు. అవకాశం వస్తే రాహుల్‌ను కలిసి ఆయన జన్మదినమైన 1970, జూన్‌ 19న జరిగిన విషయాలన్నీ వివరిస్తానని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా రాహులే ఆమెను కలవడానికి వెళ్లడంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే తమ కల అని రాజమ్మ ఓ సందర్భంలో తెలిపారు. రాహుల్‌ పౌరసత్వంపై ఆరోపణలు వచ్చిన తరుణంలోనూ రాజమ్మ స్పందించి ఆయన భారతీయుడేనని అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *