Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

యూపీలో ఇక కాషాయ జెండా ? ఎస్పీ, బీఎస్పీ ఆశలు గల్లంతు ?

Battle of Prestige for BJP While Congress Hopes for Revival in Bypoll to 11 Assembly Seats, యూపీలో ఇక కాషాయ జెండా ? ఎస్పీ, బీఎస్పీ ఆశలు గల్లంతు ?

ఉత్తరప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. చూడబోతే ఇది బీజేపీకే కలిసొచ్ఛే కాలం లా కనిపిస్తోంది.
కారణం ? కాంగ్రెస్ మాట అటుంచి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గానీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గానీ ఈ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనకపోవడమే.. సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలు గతంలో మాదిరి పొత్తు పెట్టుకుకోండా వేటికవే ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఇవి అన్ని.. 11 సీట్లకూ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. అఖిలేష్ యాదవ్ ఒక్క రామ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాత్రమే పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ఈ పార్టీ నేత తాజీజాన్ ఫాతిమా తరఫున ఆయన ప్రచారం చేశారు. ఆమె భర్త ఆజం ఖాన్ లోక్ సభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి కనీసం ఒక్క ఎన్నికల సభలోనూ పాల్గొనకపోవడం ఆశ్ఛర్యకరం. ఉపఎన్నికల ప్రచారంపట్ల తమ నాయకురాలికి నమ్మకం లేదని ఆమె సొంత పార్టీవారే ప్రకటించడం విడ్డూరం.
అలాగే 11 సీట్లకూ పోటీ చేస్తున్న కాంగ్రెస్ తన ప్రచారాన్ని మొక్కుబడిగా చేసింది. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంలో యూపీని తమ అత్యంత ప్రతిష్టాత్మక రాష్ట్రంగా భావించి.. ప్రత్యేకంగా ప్రియాంక గాంధీ ని కూడా ప్రచార బరిలోకి దింపిన ఈ పార్టీ ఈ ఉపఎన్నికల్లో ఆశలు వదలుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఎస్పీ, బీఎస్పీ ధోరణి కూడా ఉంది. ఇక బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్య నాథ్ .. అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 ఆర్టికల్ రద్దు వంటి జాతీయ అంశాలను ఆయన ప్రముఖంగా తన ప్రచార ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఇలా ఉండగా.. యూపీలో సోమవారం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఈ ఉపఎన్నికలను ఒక్క కమలం పార్టీ మాత్రమే ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఓటర్లలో కమలనాథుల హడావుడే కనిపించింది.