కరోనా వైరస్ పై పోరు, దేశంలో నాలుగు రోజుల్లో పెరిగిన రీకవరీ రేటు

గత నాలుగు రోజుల్లో దేశంలో కరోనా వైరస్ డైలీ రీకవరీ రేటు కొత్త కేసులకన్నా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ రేటు 80.86 శాతంగా ఉందన్నారు. దాదాపు..

కరోనా వైరస్ పై పోరు, దేశంలో నాలుగు రోజుల్లో పెరిగిన రీకవరీ రేటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 22, 2020 | 4:43 PM

గత నాలుగు రోజుల్లో దేశంలో కరోనా వైరస్ డైలీ రీకవరీ రేటు కొత్త కేసులకన్నా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ రేటు 80.86 శాతంగా ఉందన్నారు. దాదాపు 45 లక్షలమంది కరోనా రోగులు కోలుకున్నారని,సుమారు పది లక్షలు యాక్టివ్ కేసులని ఆయన పేర్కొన్నారు. అటు-ఇండియాలో కరోనా వైరస్ కేసులు 50 లక్షలకు పైగా పెరిగిపోయాయని రోజూ వార్తలు వస్తున్నాయని, ఇదే సమయంలో సుమారు నలభై అయిదు లక్షలమంది కోలుకున్నారన్న విషయం మరువరాదని  ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వ్యాఖ్యానించారు. రీకవరీ రేటు ఇంకా పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.