లగెత్తుకొచ్చి .. పుటుక్కున తినేసింది.. బాప్ రే !

ఆస్ట్రేలియా లోని కకాడు నేషనల్ పార్క్ అది. అక్కడ సరస్సులో చేపలు పట్టేందుకు వెళ్ళింది ఓ జంట. సరదాగా గాలంతో పడుతుండగా. ఓ పెద్ద చేపే గాలానికి చిక్కుకుంది. దాన్ని బయటకు లాగుతుండగానే వారు ఊహించని సంఘటన ఎదురైంది. సరస్సులో నుంచి ఓ భారీ మొసలి వఛ్చి.. ఆ చేపను నోట కరుచుకుని లాగించేసింది. ఆ జంట భయంతో పరుగోపరుగు ! అయితే తన ‘ ఫుడ్ ‘ దొరికింది గనుక.. మొసలి వఛ్చిన దారినే మళ్ళీ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 11:42 am, Sat, 31 August 19
Crocodile

ఆస్ట్రేలియా లోని కకాడు నేషనల్ పార్క్ అది. అక్కడ సరస్సులో చేపలు పట్టేందుకు వెళ్ళింది ఓ జంట. సరదాగా గాలంతో పడుతుండగా. ఓ పెద్ద చేపే గాలానికి చిక్కుకుంది. దాన్ని బయటకు లాగుతుండగానే వారు ఊహించని సంఘటన ఎదురైంది. సరస్సులో నుంచి ఓ భారీ మొసలి వఛ్చి.. ఆ చేపను నోట కరుచుకుని లాగించేసింది. ఆ జంట భయంతో పరుగోపరుగు ! అయితే తన ‘ ఫుడ్ ‘ దొరికింది గనుక.. మొసలి వఛ్చిన దారినే మళ్ళీ చెరువులోకి నిష్క్రమించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. అసలు మొసళ్ళు ఎక్కువగా ఉండే ఆ ‘ పూల్ ‘ వద్ద హెచ్చరిక బోర్డు ఏదీ లేకపోవడం విశేషం. అక్కడికి విజిటర్లను అనుమతించబోమని వార్నింగ్ ఇచ్చే సైన్ బోర్డు ఏదీ లేకపోవడంతో ఇలాంటి ‘ సరదా రాయుళ్లు, వారి బంధువులో ‘ వచ్చి అనుకోకుండా ప్రమాదాల బారిన పడుతుంటారు. కొందరు తప్పించుకోగలుగుతారు. అలాంటి అదృష్టవంతుల జాబితాలో ఈ జంట కూడా చేరింది.