తమ్ముణ్నికడతేర్చిన అన్న..

Kurnool Murder for Property Dispute, తమ్ముణ్నికడతేర్చిన అన్న..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్న రాజుపాలెం తాండ గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ..హత్యకు దారి తీసింది. కుటుంబ తగాదాల నేపథ్యంలో తొడబుట్టిన తమ్ముడినే హతమార్చాడు అన్న. అన్నశంకర్ నాయక్ తమ్ముడు ఈశ్వర్ నాయక్ లది పక్క పక్క నివాసాలు. ఈ క్రమంలోనే తరచుగా ఏదో ఒక విషయంలో ఇంటివద్ద గొడవ పడేవారు… శనివారం ఉదయం అన్న శంకర్ నాయక్ మద్యం మత్తులో వచ్చి తన భార్యను కొడుతుండగా తమ్ముడు ఈశ్వర్ నాయక్ అడ్డుకున్నాడు. వదినను ఎందుకు కొడుతున్నావ్ అంటూ అడ్డు చెప్పాడు … దీంతో ఆగ్రహించిన అన్నశంకర్ నాయక్ తమ్ముడు పై చేయి చేసుకున్నాడు..ఇద్దరికీ  మాటకు మాట పెరిగి ఘర్షణకు దిగారు. అన్న శంకర్ నాయక్ తమ్ముడిపై కర్రతో దాడి చేశాడు..దీంతో గమనించిన ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పడంతో తమ్ముడు ఈశ్వర్ నాయక్ వెనుదిరిగి వెళ్లిపోయాడు..ఇంతలో శంకర్‌ నాయక్‌ కత్తితో వెనక నుండి తమ్ముడ్నిబలంగా పొడవడంతో ఈశ్వర్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.. బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ మహేష్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శంకర్ నాయక్ పరారీలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *