కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా పోలింగ్‌.. 75 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడి…

కేరళలో డిసెంబర్ 8న జరిగిన తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. తొలి దశ పోలింగ్‌లో 75 శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా పోలింగ్‌.. 75 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడి...
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2020 | 10:32 PM

కేరళలో డిసెంబర్ 8న జరిగిన తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. తొలి దశ పోలింగ్‌లో 75 శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా వైరస్‌ మహమ్మారి ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. కేరళ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొగ్గు చూపారు.

మొదటి దశలో తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పతనమిట్ట, ఇడుక్కి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. రెండవ దశ పోలింగ్ డిసెంబర్ 12 న, చివరి దశ పోలింగ్‌ డిసెంబర్ 14 న జరుగనున్నది. డిసెంబర్ 16 న కౌంటింగ్ జరుగుతుంది. పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, మూడు దశాబ్దాలకు పైగా ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రత్యామ్నాయంగా అధికారాన్ని పంచుకున్నాయి. అయితే ఈసారి బీజేపీకి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!