Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

పళ్లు తోముకుంది.. ప్రాణాలు పోగొట్టుకుంది..!

Woman mistakes toothpaste with rat poison tube, పళ్లు తోముకుంది.. ప్రాణాలు పోగొట్టుకుంది..!

కర్నాటకలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలుకల మందు పేస్టును.. టూత్ పేస్ట్‌గా భావించి.. తన ప్రాణాలకే ముప్పుతెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని మాల్పేలో ఓ మహిళ.. తెల్లవారుజామునే నిద్రలేచి.. బ్రష్ చేసుకుంది. అయితే టూత్ పేస్ట్, ఎలుకల మందుకు సంబంధించిన విషం రెండూ ఒకే రకంగా ఉండడాన్ని ఆమె గమనించలేదు. ఎలుకల మందుకు సంబంధించిన పేస్ట్‌ వంటిదాన్ని బ్రష్‌కు వాడటంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారం రోజులపాటు చికిత్స పొందిన ఆమె.. చివరకు ఆదివారం రోజు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. టూత్ పేస్ట్ బదులుగా ఎలుకల మందు ఉపయోగించడంతోనే ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Related Tags