Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • నిమ్స్ లోని 5 విభాగాలు 7 నుండి9 వ తేదీ వరకు ముత పడనున్నాయ్. పాజిటివ్ వచ్చిన వారూ పనిచేసిన విభాగాలను శానిటేషన్ చేయనున్న హాస్పిటల్ సిబ్బంది ghmc. ముత పడనున్న 5 విభాగాలు: మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ.
  • గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం గందరగోళంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... గ్రేటర్ లోనే సగంమంది 10th విద్యార్థులు. సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్ . అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలనే యోచలనలో ప్రభుత్వం.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

చిచ్చు రేపిన లెటర్.. కాంగ్రెస్, బీజేపీ ట్విటర్ వార్

in karnataka, చిచ్చు రేపిన లెటర్.. కాంగ్రెస్, బీజేపీ ట్విటర్ వార్

కెఫె కాఫీ డే ఓనర్ వి.జి. సిధ్ధార్థ మృతి చెంది 36 గంటలు గడిచాయి. అప్పుడే కర్ణాటకలో రెండు ప్రధాన పార్టీల మధ్య ట్విటర్ వార్ ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఆయన ఆత్మహత్యను ‘ రాజకీయం ‘ చేయడానికి నడుం కట్టాయి. పొలిటికల్ దుమారం రేపేందుకు రెడీ అయ్యాయి. ఓ ఆదాయం పన్ను అధికారి వేధింపులకు తాను గురయ్యానని, మంచి వ్యాపారవేత్తను కాలేకపోయానని సిధ్ధార్థ తన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. (అయితే ఈ ఆరోపణను ఇన్ కమ్ టాక్స్ వర్గాలు ఖండించాయి. సిధ్ధార్థ సంతకానికి, ఈ లేఖలోని సంతకానికి మధ్య ఎంతో తేడా ఉన్నాయని తెలిపాయి. 2017 లో తన కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన సందర్భంలో లెక్కల్లో చూపని ఆదాయాన్ని దాచినట్టు ఆయన అంగీకరించారని ఈ వర్గాలు గుర్తు చేశాయి).

కాగా-సిధ్ధార్థ మృతి దురదృష్టకరమని, ఐటీ అధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని రాష్ట్ర కాంగ్రెస్ తన ట్విటర్ లో ఆరోపించింది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవర్గాలు క్రమేపీ కుప్పకూలుతున్నాయనడానికి సిధ్ధార్థ సూసైడే నిదర్శనమని ఈ పార్టీ పేర్కొంది. ఇండియాలో ‘ టాక్స్ టెర్రర్, ‘, ఎకానమీ కొలాప్స్ ఫలితంగా ఔత్సాహిక పారిశ్రామికవర్గాలు ఇలా డీలా పడుతున్నాయని విమర్శించింది. యూపీఏ హయాంలో వెలుగు వెలిగిన కంపెనీలు ఇప్పుడు మూత పడుతున్నాయి. అనేకమంది నిరుద్యోగులుగా మారుతున్నారు.. అని కాంగ్రెస్ తన ట్విట్టర్లో దుయ్యబట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ.. అవకాశవాద రాజకీయాలు ‘ వెల్లువెత్తుతున్నాయని ‘, సిధ్ధార్థ కుటుంబ సభ్యుల ఎమోషన్లను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంది. సిధ్ధార్థ మృతిపై జరిగే దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని, అంతవరకు కాస్త మానవత్వాన్ని ప్రదర్శించాలని ఈ పార్టీ కౌంటర్ ఇచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ సీఎం సిధ్ధరామయ్య కూడా ట్వీట్ చేస్తూ..
‘ పన్నుల వ్యవస్థ ‘ టెర్రరిజానికి పాల్పడుతోందని, ‘ రాజకీయ దురుద్దేశంతో కూడిన వ్యవస్థలు పేట్రేగుతున్నాయని అన్నారు. సిధ్ధార్థ మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆయన కోరారు. న్యాయంకోసం సిధ్ధార్థ మామగారు ఎస్.ఎం.కృష్ణ జరిపే పోరాటంలో తమ పార్టీ పూర్తి అండగా నిలుస్తుందన్నారు.

ఇదిలా ఉండగా సిధ్ధార్థ ఆత్మహత్యపై దర్యాప్తు ప్రారంభమైంది. ఆయనను నిజంగా ఐటీ అధికారులెవరైనా వేధించారా.. ఆయన ఆదాయాన్ని చూసి ఆయన శత్రువులెవరైనా ఐటీ శాఖకు సమాచారమిచ్చారా.. అసలు ఆయన ఆస్తులు, అప్పులు ఎన్ని, ఎంతమందికి ఆయన అప్పులు ఇవ్వాల్సి ఉంది తదితర విషయాలపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అధికారులు ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

Related Tags