అక్కడ యువత ప్రాణాలే ఎక్కువగా తీసుకుంటోన్న ‘కరోనా’..!

వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికే కరోనా వైరస్ పెను శాపంగా మారినట్లు ఇప్పటి వరకు వెల్లడైన చాలా గణాంకాలు చెప్పాయి. అయితే లాటిన్ అమెరికన్‌ దేశమైన బ్రెజిల్‌లో ఈ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా యువతే కరోనాతో చనిపోతున్నారట. అందుకు అక్కడి యువత కరోనాను సీరియస్‌గా తీసుకోకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకకుండా ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను అక్కడి యువత అస్సలు పట్టించుకోవడం లేదని, ఉపాధి కోసం వారు బయటకు […]

అక్కడ యువత ప్రాణాలే ఎక్కువగా తీసుకుంటోన్న 'కరోనా'..!
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 6:02 PM

వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికే కరోనా వైరస్ పెను శాపంగా మారినట్లు ఇప్పటి వరకు వెల్లడైన చాలా గణాంకాలు చెప్పాయి. అయితే లాటిన్ అమెరికన్‌ దేశమైన బ్రెజిల్‌లో ఈ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా యువతే కరోనాతో చనిపోతున్నారట. అందుకు అక్కడి యువత కరోనాను సీరియస్‌గా తీసుకోకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా సోకకుండా ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను అక్కడి యువత అస్సలు పట్టించుకోవడం లేదని, ఉపాధి కోసం వారు బయటకు వెళ్లడం వలన వైరస్‌ బారిన ఎక్కువగా పడుతున్నారని ఓ వైద్య నిపుణులు మీడియాకు వెల్లడించారు. ఇక ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలు కూడా కారణమని పలువురు విమర్శిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో విరుద్ధ నిర్ణయాల వలన యువత విధుల్లోకి వెళ్తోందని, అందుకే వైరస్ తీవ్రత వారిలోనే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అందులోనూ పేదరికం ఎక్కువగా ఉండటంతో యువత కడుపు నింపుకోవడానికి బయటకు వెళ్లాల్సి వస్తోందని వారు అంటున్నారు. కాగా బ్రెజిల్‌లో 31లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 20వేల మందికి పైగా మరణించారు. ఇక కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని విమర్శిస్తూ.. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని అత్యున్నత పదవికి క్రోడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ‘బిగ్‌బాస్‌ 4’.. ఆ నలుగురు ఫిక్స్‌ అయ్యారా..!

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..