కాశ్మీర్ పై పంజా విసిరి.. .. ఇండియాను దెబ్బ కొట్టండి.. . టెర్రరిస్టులకు జవహరి పిలుపు

ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నఅల్ ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయమన్-అల్-జవహరి ఒక్కసారిగా పేట్రేగిపోయాడు. భారత దేశంపై తన ద్వేషాన్నంతా వెలిగక్కాడు. కాశ్మీర్ లోని ముజాహిదీన్ లు అక్కడి ఇండియన్ ఆర్మీపైన, ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన కోలుకోలేని దెబ్బ కొట్టాలంటూ తాజాగా విడుదల చేసిన వీడియోలో కోరాడు. కాశ్మీర్ విషయాన్ని మరవొద్దు అని పేర్కొన్నాడు. ఆ రాష్ట్రంలోని ముజాహిదీన్ లు భారత దళాల పైన, ప్రభుత్వం పైన పెను దాడులు చేయాలని, తద్వారా భారత ఆర్ధిక వ్యవస్థను […]

కాశ్మీర్ పై పంజా విసిరి.. .. ఇండియాను దెబ్బ కొట్టండి.. . టెర్రరిస్టులకు జవహరి పిలుపు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 3:48 PM

ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నఅల్ ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయమన్-అల్-జవహరి ఒక్కసారిగా పేట్రేగిపోయాడు. భారత దేశంపై తన ద్వేషాన్నంతా వెలిగక్కాడు. కాశ్మీర్ లోని ముజాహిదీన్ లు అక్కడి ఇండియన్ ఆర్మీపైన, ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన కోలుకోలేని దెబ్బ కొట్టాలంటూ తాజాగా విడుదల చేసిన వీడియోలో కోరాడు. కాశ్మీర్ విషయాన్ని మరవొద్దు అని పేర్కొన్నాడు. ఆ రాష్ట్రంలోని ముజాహిదీన్ లు భారత దళాల పైన, ప్రభుత్వం పైన పెను దాడులు చేయాలని, తద్వారా భారత ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీయాలని జవహరి అన్నాడు. మానవ శక్తి,, ఆయుధ సంపత్తిలో భారత దేశానికి భారీ నష్టాలు కల్పించండి.. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం కూడా అమెరికా చేతిలో కీలుబొమ్మలు..ఉగ్రవాదులు పాక్ ట్రాప్ లో పడరాదు అని జవహరి ఈ వీడియోలో పేర్కొన్నాడు. పాక్ ఆర్మీ, ప్రభుత్వం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముజాహిదీన్ లను వాడుకోజూస్తున్నాయని, ఆ ప్రయోజనాలు తీరిన తరువాత వారిని అవతల ‘ పారేస్తున్నాయని ‘ పాక్ పై కూడా ధ్వజమెత్తాడు. ఇండియాతో పాకిస్తాన్ ఘర్షణ అన్నది అమెరికన్ ఇంటెలిజెన్స్ అజమాయిషీలో సరిహద్దులపై జరిపే ‘ సెక్యులర్ ‘ రైవల్రీ తప్ప మరేమీ కాదని అభివర్ణించాడు. కాశ్మీర్ లో మసీదులు, మార్కెట్లు, ముస్లిములు చేరే ప్రదేశాలను టార్గెట్లు చేయకండి అని టెర్రరిస్టులను జవహరి కోరాడు.

తన కుడివైపున రైఫిల్, ఎడమవైపున ఖురాన్ పట్టుకుని ఈ ఉగ్రవాది ఈ వీడియో రూపొందించాడు. కాశ్మీర్ లో లోగడ భారత భద్రతా దళాల చేతిలో హతమైన టెర్రరిస్టు జకీర్ మూసా గురించి జవహరి ప్రస్తావించకపోయినప్పటికీ.. స్క్రీన్ పై అతని ఫోటో కనబడేలా వీడియో తీసి.. తన ఉద్దేశమేమిటో చాటాడీ కరడుగట్టిన ఉగ్రవాది.