సుష్మా స్వరాజ్‌కు అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ విదేశాంగ మంత్రుల సమావేశానికి గౌరవ అతిధిగా హాజరు కావాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ విధంగా భారత విదేశాంగ మంత్రికి ఆహ్వానం అందడం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్చి 1న అబిదబిలో ఈ సమావేశం జరగనుంది. ఈ ఆహ్వానం ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో […]

సుష్మా స్వరాజ్‌కు అరుదైన గౌరవం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:06 PM

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ విదేశాంగ మంత్రుల సమావేశానికి గౌరవ అతిధిగా హాజరు కావాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ విధంగా భారత విదేశాంగ మంత్రికి ఆహ్వానం అందడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మార్చి 1న అబిదబిలో ఈ సమావేశం జరగనుంది. ఈ ఆహ్వానం ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయి. అంతర్జాతీయంగా ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. సమావేశం ప్రారంభంలో సుష్మాస్వరాజ్ కీలక ఉపన్యాసం చేయనున్నారు.