Breaking News
  • బతకటం కాదు.. ఇతరులకు ఉపయోగపడేలా బతకటం గొప్ప. భౌతికంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దూరమయ్యారు. కానీ ఆయన గళం సంగీతం ఉన్నన్నాళ్లు బతికే ఉంటుంది: రామ్ గోపాల్‌ వర్మ.
  • గాన గంధర్వుని మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రగాఢ సంతాపం. 'బాలు'కి నివాళిగా రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ మూసివేతకు పిలుపు. 16 భాషల్లో నలభై వేల పాటలు పాడిన 'కారణజన్ముడు' ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ప్రముఖ గాయని-'తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్' అధ్యక్షురాలు విజయలక్ష్మి. రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ అన్నీ స్వచ్చందంగా మూసివేయాలని.. గాయనీగాయకులంతా పాటల రికార్డింగ్స్ కు దూరంగా ఉండాలని.. తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, కార్యదర్శి లీనస్, కోశాధికారి రమణ శీలం పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలకు లోబడి గాన గంధర్వునికి ఘన నివాళి అర్పించేందుకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామని విజయలక్ష్మి తెలిపారు.
  • దేశవ్యాప్త కోవిడ్ గణాంకాలు: 24 గంటల వ్యవధిలో మరణాలు 1,141. మొత్తం కోవిడ్ మరణాలు 92,290. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 58,18,571. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 9,70,116. దేశంలో మొత్తం రికవరీలు 47,56,164.
  • అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. : రాజమౌళి.
  • అమరావతి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్, సిఐడి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేడపాటి బాల సత్యనారాయణ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • అమరావతి : ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్‌లో పరామర్శ. అమరావతి: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ.చరణ్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరనిలోటని అన్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు.

మరో వెయ్యి రోజుల్లో అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్, మోదీ

మరో వెయ్యి రోజుల్లో దేశంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు..

in 1.000 days every village to have optical fibre net work says pm modi, మరో వెయ్యి రోజుల్లో అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్, మోదీ

మరో వెయ్యి రోజుల్లో దేశంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. 2014 కి ముందు ఇండియాలో కేవలం 60 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఇవి అందుబాటులో ఉండేవని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఈ సంఖ్య లక్షన్నరకు పెరిగిందని అన్నారు. రానున్న వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికీ ఆన్ లైన్ సౌకర్యం కలుగుతుందన్నారు. భవిషత్తులో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులకు ఇది ముఖ్య ఆధారమని, సెకండుకు 10 జీబీ స్పీడ్ తో డేటా బదిలీకి వీలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా-కేంద్రం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానం వల్ల విద్యార్థుల్లో గ్లోబల్ సిటిజన్లుగా మారడానికి అవకాశం ఉంటుందని మోదీ వివరించారు.

బలవంతంగా ఏ భాషనూ రాష్ట్రాల మీద రుద్దరాదన్నది కేంద్ర లక్ష్యమని మోదీ పేర్కొన్నారు, .

 

 

Related Tags