స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్ డే‌గా జరుపుకోవాలి

August 15 Celebrate As Black Day Says Imran Khan, స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్ డే‌గా జరుపుకోవాలి

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్ రగిలిపోతోంది. వారి అసంతృప్తిని తెలియజేస్తూ.. ఇప్పటికే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా భారత్ నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా పాక్ రద్దు చేయడం జరిగింది. ఇంతటితో ఆగకుండా పాక్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కుకున్నాడు. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగష్టు 14న కశ్మీర్ ప్రజలకు మద్దతుగా జరుపుకోవాలని.. భారత్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మాత్రం బ్లాక్ డే‌గా జరుపుకోవాలని పలు దేశాల్లో ఉన్న పాకిస్థానీలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *