కశ్మీర్ పై చర్చలకు సిద్ధం…మోదీకి లేఖ‌: ఇమ్రాన్‌

కశ్మీరు వివాదం సహా పరిష్కరించుకోదగిన అన్ని సమస్యలపై చర్చలకు సిద్ధమని పేర్కొంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు.. కశ్మీర్ అంశం సహా పలు సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధమేనని ఆయన ఈ లేఖలో పేర్కొన్నట్టు పాక్ మీడియా వెల్లడించింది. వచ్చే వారం బిష్కెక్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి చర్చలు ఉండబోవంటూ భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే పాక్ ప్రధాని లేఖ రాయడం […]

కశ్మీర్ పై చర్చలకు సిద్ధం...మోదీకి లేఖ‌: ఇమ్రాన్‌
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2019 | 6:35 PM

కశ్మీరు వివాదం సహా పరిష్కరించుకోదగిన అన్ని సమస్యలపై చర్చలకు సిద్ధమని పేర్కొంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు.. కశ్మీర్ అంశం సహా పలు సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధమేనని ఆయన ఈ లేఖలో పేర్కొన్నట్టు పాక్ మీడియా వెల్లడించింది. వచ్చే వారం బిష్కెక్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి చర్చలు ఉండబోవంటూ భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే పాక్ ప్రధాని లేఖ రాయడం గమనార్హం

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి తన లేఖలో అభినందనలు తెలిపిన ఇమ్రాన్… ఇరుదేశాల ప్రజలు పేదరికాన్ని అధిగమించాలంటే రెండు దేశాల మధ్యా చర్చలే మార్గమని పేర్కొన్నట్టు జీయోటీవీ వెల్లడించింది. ప్రాంతీయ అభివృద్ధికి ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయడం అత్యంత కీలకమని ఇమ్రాన్ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే ఈ లేఖపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కాగా ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమంటూ ఇమ్రాన్ పేర్కొనడం ఇది రెండోసారి.

ఫిబ్రవరి 14న 50 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించడం, ఆ మరుసటి రోజే పాకిస్తాన్ వైమానిక దళాలు భారత్‌పై దాడికి ప్రయత్నించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే పాక్ విమానాలను తిప్పికొడుతూ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కిన భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌ను తిరిగి అప్పగించడంతో దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?