సమంత చెవి దిద్దులు.. మీరు చూశారా..

ఫ్యాషన్..స్టైల్.. దేనిలోనైనా తనకు ఓ ప్రత్యేకత ఉందంటుంది అక్కినేని కోడలు సమంత.. ఖద్దరు చీర కట్టినా.. మోడ్రన్ లుక్‌లో మెరిసినా.. సౌత్ ఇండియాలో తాను  వెరీ స్పెషల్ అంటుంది. అంతే కాదు ఏదైనా ట్రెండ్‌ను క్రియేట్ చేయాలన్నా.. డిసైడ్ చేయాలన్నా తానే ఓ అడుగు ముందే ఉంటుంది. మొన్న రానా దగ్గుబాటి మిహీకా బజాజ్ వారి పెళ్లి వేడుకతో పొందూరు చేనేత వస్త్రాలను ధరించి ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. ఇలా ఏ స్టైల్ అయినా తాను  ఓ […]

సమంత చెవి దిద్దులు.. మీరు చూశారా..
Follow us

|

Updated on: Aug 19, 2020 | 3:01 PM

ఫ్యాషన్..స్టైల్.. దేనిలోనైనా తనకు ఓ ప్రత్యేకత ఉందంటుంది అక్కినేని కోడలు సమంత.. ఖద్దరు చీర కట్టినా.. మోడ్రన్ లుక్‌లో మెరిసినా.. సౌత్ ఇండియాలో తాను  వెరీ స్పెషల్ అంటుంది. అంతే కాదు ఏదైనా ట్రెండ్‌ను క్రియేట్ చేయాలన్నా.. డిసైడ్ చేయాలన్నా తానే ఓ అడుగు ముందే ఉంటుంది. మొన్న రానా దగ్గుబాటి మిహీకా బజాజ్ వారి పెళ్లి వేడుకతో పొందూరు చేనేత వస్త్రాలను ధరించి ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. ఇలా ఏ స్టైల్ అయినా తాను  ఓ స్పెషల్ అంటోంది ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ సెట్‌ చేస్తుంటారు సమంత.

తాజాగా సమంత ఇయర్‌ రింగ్స్‌ తెగ ట్రెండ్‌ అవ్వతున్నాయి. నెట్టింట్లో యువతులును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. వీటిలో సమంత ఏకంగా ఐదు చిన్న చిన్న చెవి దుద్దులతో దిగిన ఓ ఫోటోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో డైమండ్‌, ఇతర మెటల్స్‌తో తయారు చేసిన ఈ చిన్న చిన్న స్టడ్స్‌ యువతులను తెగ ఆకర్షిస్తున్నాయి.  ‘న్యూ పియర్సింగ్స్’‌ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. ‘సూపర్బ్‌.. ఫ్యాషన్‌లో మీకు మీరే సాటి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

View this post on Instagram

New piercings ?

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on