కొబ్బరి నూనెతో కో..అంటే కోటి లాభాలు

Important Health Benefits with Cocont oil, కొబ్బరి నూనెతో కో..అంటే కోటి లాభాలు

కొబ్బరి నూనె..దీంతో ఏం  చేస్తారు..? మామూలుగానే తలకు పెట్టుకుంటారు..జట్టుకు పోషణ అందిస్తుందని మనకు తెలుసు.  ఇంకా చెప్పాలంటే..కొందరు కొబ్బరి నూనెను వంటల్లో కూడా వాడుతుంటారు..అయితే, ఈ కొబ్బరి నూనెలో మనకు తెలియని మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నూనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. కొబ్బరి నూనె చాలా వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కేరళలలో కొబ్బరి నూనెతో తయారు చేసిన ఆహారాన్నిఎక్కువగా తీసుకుంటారు. అందువల్లే మిగతా రాష్ట్రాలతో పొలిస్తే..కేరళలో గుండె జబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోదనల ద్వారా నిరూపితమైంది. తీయ్యటి వాసనతో ఉండే కొబ్బరి నూనెను వంటకాల్లో వాడటం వల్ల శరీర బరువు కూడా తగ్గుతారట.

ఇవి కొబ్బరి నూనెతో కలిగి ప్రయోజనాలుః

* కొబ్బరినూనె జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు అధికంగా ఉంటాయి.
* లారిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా, వైరస్‌ వంటి హానికర సూక్ష్మ క్రిములను నివారిస్తుంది.
* కొబ్బరి నూనె అంటువ్యాధులను తరిమి కొడుతుంది.
* ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు కాలేయ సంబంధిత వ్యాధులను అరికడుతుంది.
* మూత్రపిండాలలో ఉన్న రాళ్లను, పిత్తాశయం సమస్యలను నివారిస్తుంది.
* కొబ్బరి నూనెలోని శ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండెకు మేలు చేస్తాయి.
* లారిక్‌ యాసిడ్‌ కొలెస్ట్రాల్‌, రక్తపోటు వల్ల గుండెకు హాని కలుగకుండా చేస్తుంది.
* దంత క్షయాన్ని నివారిస్తుంది.
* మెదడు కణాలకు శక్తినందించి అల్జీమర్స్‌ బారినుండి కాపాడుతుంది.
* క్యాన్సర్‌ కణితులను ప్రేరేపించే కణాలను నాశనం చేసే శక్తి కొబ్బరి నూనెకు ఉంది.
* ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేస్తుంది.
* ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *